కొత్త డేటా ప్యాక్‌ను పరిశీలిస్తే.. కస్టమర్లు ఒక జీబీ డేటా కోసం రూ. 4.44 చెల్లించుకోవాల్సి ఉంది. ఇతర కంపెనీల ప్లాన్స్‌తో పోలిస్తే.. ఎయిర్టెల్ తన యూజర్లకు రూ. 301 ప్లాన్ అందిస్తోంది. ఇందులో 50 జీబీ డేటా వస్తుంది. అంటే ఒక జీబీ కోసం రూ. 6 చెల్లించుకోవాలి. అలా చూస్తే ఎయిర్టెల్ డేటా ప్లాన్ కన్నా జియో డేటా ప్లాన్ చౌక అని చెప్పుకోవచ్చు.