స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) సందర్భంగా తమ యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది రిలయన్స్ జియో (Reliance Jio). ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ‘ఇండిపెండెన్స్ డే 2022’ ఆఫర్‌ను జియో ప్రకటించింది. తాజా ప్లాన్‌తో కస్టమర్లకు రూ.3,000 విలువైన ప్రయోజనాలతో పాటు ఏడాది వరకు వ్యాలిడిటీ అందిస్తోంది జియో. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ కొత్త ప్లాన్‌కు సంబంధించిన వివరాలను కంపెనీ అధికారిక ట్విట్టర్(Twitter) హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. ‘జియో అందిస్తున్న రూ. 2999 ఇండిపెండెన్స్ ఆఫర్‌తో స్వాతంత్య్ర దినోత్సవాన్ని సెలబ్రెట్ చేసుకోండి. రూ. 3000 విలువైన ఉచిత ప్రయోజనాలను ఆస్వాదించండి’ అని రిలయన్స్ జియో ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ రీఛార్జ్ ప్లాన్ ప్రత్యేకతలు తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
ఇండిపెండెన్స్ డే 2022 ప్లాన్ బెనిఫిట్స్: ఇండిపెండెన్స్ డే ఆఫర్ కింద రిలయన్స్ జియో రూ. 2,999 విలువైన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వాలిడిటీని కలిగి ఉంటుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకున్న జియో కస్టమర్లు రోజుకు 100 SMSలతో పాటు 2.5GB రోజువారీ డేటా పొందుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
రోజువారీ డేటా యూసేజ్ లిమిట్ ముగిసిన తర్వాత, ఇంటర్నెట్ స్పీడ్ 64kbpsకి పడిపోతుంది. కొత్త ప్లాన్‌తో ప్రీపెయిడ్ నంబర్‌ను రీఛార్జ్ చేసుకునే జియో యూజర్లకు రూ. 3,000 విలువైన అదనపు ప్రయోజనాలను కంపెనీ అందించనుంది. JioTV, JioCinema, JioSecurity, JioCloud యాప్ లకు ఉచితంగా యాక్సెస్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ ప్లాన్ ను ఎంచుకున్న వారికి లభించే ఇతర ప్రయోజనాల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ప్లాన్ ను ఎంచుకుంటున్న వారికి 75GB అదనపు డేటా, 1 సంవత్సరండిస్నీ+ హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ఇంకా.. ఈ ప్లాన్ ను ఎంచుకున్న వారికి రూ. 750 విలువైన Ajio కూపన్ కూడా లభిస్తుంది. నెట్‌మెడ్స్‌పై రూ. 750 తగ్గింపు, Ixigoపై రూ. 750 తగ్గింపు లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
కస్టమర్లు అన్లిమిటెడ్ కాలింగ్, 2GB రోజువారీ డేటా, రోజుకు 100 SMS లతో పాటు జియో యాప్‌లు, సేవలకు యాక్సెస్ పొందవచ్చు. రిలయన్స్ జియో రూ. 2,545 ప్రీపెయిడ్ ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. కస్టమర్లకు అన్లిమిటెడ్ కాల్స్, 1.5 GB రోజువారీ డేటా, రోజుకు 100 SMSలతో పాటు జియో యాప్స్ అన్నింటికీ యాక్సెస్ లభిస్తుంది. (ఫొటో: ట్విట్టర్)