Jio Happy New Year Offer: జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్.. ఆ ప్లాన్ తో ఏకంగా ఏడాది వ్యాలిడిటీ.. ఆఫర్ జనవరి 2 వరకే..
Jio Happy New Year Offer: జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్.. ఆ ప్లాన్ తో ఏకంగా ఏడాది వ్యాలిడిటీ.. ఆఫర్ జనవరి 2 వరకే..
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో న్యూ ఇయర్ సందర్భంగా తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీని ఏకంగా ఏడాదికి పొడిగించింది. అయితే ఈ ఆ ఆఫర్ జనవరి 2 వరకు రీఛార్జ్ చేసుకున్న వారికి మాత్రమే లభిస్తుంది.
టెలికాం దిగ్గజం జియో ఎప్పటికప్పుడు సరికొత్త సంచలన ప్లాన్లతో వినియోగదారులకు సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటుంది. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది జియో. మరో సూపర్ ఆఫర్ ను ప్రకటించింది.
2/ 7
అయితే.. న్యూ ఇయర్ సందర్భంగా తీసుకువచ్చిన ఈ ఆఫర్ జనవరి 2 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని జియో తెలిపింది. ఆ తేదీలోగా రీఛార్జ్ చేసుకున్న వారు మాత్రమే ఈ అదనపు ప్రయోజనాన్ని పొందుతారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
3/ 7
Jio Rs 2545 Plan: వాస్తవానికి ఈ ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులు. అయితే న్యూ ఇయర్ సందర్భంగా ఈ ప్లాన్ వ్యాలిడిటీని 29 రోజులు పొడిగించింది. దీంతో జనవరి 2వ తేదీ వరకు ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులకు 29 రోజులు అదనంగా.. మొత్తం 365 రోజులు అంటే ఏడాది వ్యాలిడిటీ లభిస్తుంది.
4/ 7
ఇంకా ఈ ప్లాన్ కు సంబంధించిన ఇతన బెనిఫిట్స్ విషయానికి వస్తే.. ఈ ప్లాన్ ఎంచుకున్న వినియోగదారులకు నిత్యం 1.5జీబీ డేటా లభిస్తుంది. అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. ప్రతీ రోజు ఉచితంగా 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి.
5/ 7
ఇంకా ఈ ప్లాన్ ఎంచుకున్న వారికి జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్, జియో సావన్ తదితర యాప్స్ ను ఉచితంగా సబ్క్రైబ్ చేసుకోవచ్చు. ఏడాది వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ వర్క్ ఫ్రం హోం చేసేవారికి ప్రయోజనంగా ఉంటుంది.
6/ 7
ఇటీవల జియో తన కస్టమర్ల కోసం కేవలం రూ. 1తోనే ప్లాన్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇతర నెట్ వర్క్ లేవీ ఇంత తక్కువ ధరకు ప్లాన్లు అందించకపోవడం విశేషం. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకునే వారికి 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది.
7/ 7
డేటా ఎక్కువగా అవసరం లేనివారికి ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్లాన్ ఎంచుకున్న వారికి 100 ఎంబీ డేటా కూడా లభిస్తుంది.