టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతూ వినియోగదారులకు సర్ ప్రైజ్ ఇస్తూనే ఉంటుంది. దీంతో అత్యధిక మంది వినియోగదారులు ఉన్న టెలికాం సంస్థగా జియో అగ్రస్థానంలో ఉంది. Jio తన వినియోగదారులకు తక్కువ ధరలో ఎక్కువ డేటాతో ఇతర అనేక ప్రయోజనాలను అందిస్తుంది. తాజాగా మరో సంచలన ప్లాన్ ను తీసుకువచ్చింది జియో.(ప్రతీకాత్మక చిత్రం)
ఇదిలా ఉంటే రిలయన్స్ జియో (Reliance Jio) తన వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. పలు ప్లాన్లపై 20 శాతం క్యాష్ బ్యాక్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్లాన్లను ఎంచుకుని రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులు మూడు రోజుల్లోగా క్యాష్ బ్యాక్ ను పొందుతారని జియో వెల్లడించింది. ఆ ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
ఈ ప్లాన్లను ఎంచుకుని రీఛార్జ్ చేసుకోవడం ద్వారా లభించిన క్యాష్ బ్యాక్ ను రిటైల్ స్టోర్స్, జియో ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్ లో వినియోగించుకోవచ్చని జియో తెలిపింది. ఇలా రీఛార్జ్ ల ద్వారా వినియోగదారులు గరిష్టంగా ప్రతీ రోజు రూ.200 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చని జియో తన ప్రకటనలో పేర్కొంది.(ప్రతీకాత్మక చిత్రం)