ప్రస్తుతం మొబైల్ ఆపరేటర్ల మధ్య పెరిగిన పోటీ కారణంగా ఆపరేటర్లన్నీ పోటాపోటీగా తక్కువ ధరకే డేటా ప్లాన్లను అందిస్తున్నాయి. ముఖ్యంగా జియో వచ్చినప్పటి నుంచి అన్ని మొబైల్ ఆపరేటర్లు అన్లిమిటెడ్ ప్లాన్లను ప్రవేశపెట్టక తప్పలేదు. తక్కువ ధరకే అన్లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎంఎస్, డేటా లభిస్తుండటంతో ప్రతి ఒక్కరూ అన్లిమిటెడ్ ప్లాన్లను ఎంచుకుంటున్నారు.
జియో చౌకైన డేటా ప్లాన్లు (రూ. 11, రూ. 21) భారత టెలికాం రంగంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన రిలయన్స్ జియో కేవలం రూ. 11లకే 1GB డేటాను అందిస్తుంది. దీనితో పాటు జియో రూ.21కే మరో చౌకైన డేటా ప్లాన్ను కూడా అందిస్తుంది. వినియోదారులు ప్లాన్ కాలపరిమితి ముగిసే వరకు 2జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. ఈ రెండు మినీ ప్యాక్లలో మెసేజ్, వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు మాత్రం అందుబాటులో ఉండవు. మీకు వాయిస్ కాలింగ్ లేదా ఎస్ఎంఎస్ సేవలు అవసరమైతే, జియో అందించే కాంబో ప్యాక్లను రీఛార్జ్ చేసుకోవచ్చు.
Vi చౌకైన డేటా ప్లాన్లు-(రూ. 16, రూ. 48) ఇటీవలే Vi గా రూపాంతరం చెందిన వొడాఫోన్ ఐడియా కేవలం రూ. 16లకే 1GB డేటాను అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ కేవలం 24 గంటలు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. ఈ సమయంలో డేటా మొత్తాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. దీనితో పాటు, వొడాఫోన్ ఐడియా రూ. 48లతో మరో డేటా ప్లాన్ను కూడా అందిస్తుంది. ఇది 28 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఈ ప్లాన్ కింద మొత్తం 3GB డేటాను పొందవచ్చు. జియో ప్లాన్ల మాదిరిగానే, ఈ ప్లాన్లు కూడా ఎటువంటి వాయిస్ కాలింగ్ లేదా SMS ప్రయోజనాలను అందించడం లేదు.
ఎయిర్టెల్ చౌకైన డేటా ప్లాన్లు (-రూ. 48, రూ. 78) ఎయిర్టెల్ రూ. 48లకే డేటా ప్లాన్ను అందిస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీ గల ఈ ప్లాన్ కింద మొత్తం 3GB డేటా లభిస్తుంది. ఈ మొత్తం డేటా పూర్తయిన తర్వాత, వినియోగదారుడి నుంచి ప్రతి ఎంబికి 50 పైసలు చొప్పున వసూలు చేస్తుంది. దీనితో పాటు ఎయిర్టెల్ రూ. 78లకు మరో చౌకైన డేటా ప్లాన్ను అందిస్తుంది. ఈ ప్లాన్ కింద మొత్తం 5GB డేటా లభిస్తుంది.