Photos : స్టార్ వార్స్ ఎగిరే బైక్.. రోజులు మారిపోతున్నాయ్ బాస్!
Photos : స్టార్ వార్స్ ఎగిరే బైక్.. రోజులు మారిపోతున్నాయ్ బాస్!
Star Wars hoverbike XTurismo : రోడ్డుపై బైక్ నడపడం కామన్. అదే గాల్లో దూసుకుపోయే బైక్‌పై వెళ్లడం సూపర్ థ్రిల్. అలాంటి బైక్ వచ్చేసింది. దాని పూర్తి వివరాలు తెలుసుకుందాం. (All images credit - instagram - xturismo_official)
స్టార్ వార్స్ వంటి సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో నటీనటులు.. గాలిలో ఎగిరే వాహనాలపై దూసుకెళ్తారు. అలాంటి బైక్స్ ఇప్పటివరకూ రియల్‌గా లేవు. ఇప్పుడు రియల్ గానే అలాంటి బైకులు వచ్చేశాయి.
2/ 17
జపాన్ రాజధాని.. టోక్యోకి చెందిన అలీ టెక్నాలజీస్ (ALI Technologies) కంపెనీ... ఈ హోవర్ బైక్ (hoverbike)ని తయారుచేసింది.
3/ 17
ఈ లగ్జరీ బైక్‌ని ఎక్స్టూరిస్మో (XTurismo) అని పిలుస్తున్నారు.
4/ 17
స్టార్ వార్స్ సినిమా ప్రేరణతో ఈ బైక్‌ని తయారు చేశారు. దీని ధర $550,000 (రూ.4,56,13,452).
5/ 17
అలీ టెక్నాలజీస్ కంపెనీ... AERWINS కంపెనీకి అనుబంధ సంస్థ. మాజీ మెరిల్ లించ్ ట్రేడర్ ఎర్విన్స్ ఈ కంపెనీని ప్రారంభించారు.
6/ 17
బైక్ ఒకటి రియల్‌గా చెయ్యాలి అనుకున్న కంపెనీ.. 2017 నుంచి ప్రయత్నించగా.. ఇప్పటికీ రియాలిటీలోకి వచ్చింది." width="1080" height="1080" /> ఇలాంటి బైక్ ఒకటి రియల్‌గా చెయ్యాలి అనుకున్న కంపెనీ.. 2017 నుంచి ప్రయత్నించగా.. ఇప్పటికీ రియాలిటీలోకి వచ్చింది.
7/ 17
ఈ బైక్ బరువు 272 కేజీలు. ఇది గ్యాస్-ఎలక్ట్రిక్ హైబ్రీడ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్. ఇది నాలుగు ఎలక్ట్రిక్ మోటర్లతో పనిచేస్తుంది.
8/ 17
కార్బన్ ఫైబర్‌తో తయారుచేసిన ఈ బైక్.. 12 అడుగుల పొడవు ఉంది.
9/ 17
ఈ టూరిస్మో బైక్.. గంటకు 96 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఐతే.. ఇది ప్రస్తుతానికి గాల్లో కంటిన్యూగా 40 నిమిషాలు మాత్రమే ఎగురుతుంది.
10/ 17
అంతా బాగానే ఉన్నా... ఈ బైక్ ధర చాలా ఎక్కువగా ఉండటం నిరాశ కలిగిస్తున్న అంశం. అయితే.. భవిష్యత్తులో ఎక్కువగా ఉత్పత్తి చేస్తే.. ధర తగ్గే అవకాశాలు ఉంటాయి.
11/ 17
అసలు ఈ బైక్ తయారుచేయడానికి ప్రధాన కారణం ఒకటుంది. ఎక్కడైనా రెస్క్యూ ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు.. గాయపడిన వారిని త్వరగా ఆస్పత్రికి తరలించేందుకు ఈ బైక్ ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది.
12/ 17
ప్రపంచవ్యాప్తంగా రెస్క్యూ ఆపరేషన్ల (disaster response) కోసం ఈ బైక్‌ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
13/ 17
మొదటి హోవర్ బైక్‌ని డిసెంబర్ 2022లో జపాన్ వ్యాపారవేత్త యోషియుకి ఐకావా కొన్నారు. కానీ దీన్ని రోడ్లపై వాడే ఛాన్స్ లేదు. ప్రస్తుతానికి ప్రైవేట్ స్థలంలో దీన్ని వాడుకుంటున్నారు.
14/ 17
ప్రస్తుతం అమెరికా, జపాన్ సహా చాలా దేశాల్లో హోవర్ బైక్స్... రోడ్లపై, గాల్లో ఎగిరేందుకు పర్మిషన్ లేదు. అందువల్ల దేశాల చట్టాలలో మార్పులు తప్పనిసరి.
15/ 17
జపాన్‌లో ఇలాంటి బైక్ నడిపేందుకు.. పైలట్ లైసెన్స్ అవసరం లేదు. కానీ అమెరికాలో తప్పనిసరి. అందువల్ల ఆయా దేశాల చట్టాల్లో మార్పులు వస్తే తప్ప.. ఇలాంటి టెక్నాలజీ అమల్లోకి రాదు.
16/ 17
ఇలాంటి బైక్స్‌ని సామాన్యులు కొనే పరిస్థితి లేదు. వీటికి పోటీగా ఫ్లైయింగ్ కార్స్ కూడా రియాలిటీలో ఉన్నాయి. అవి కూడా ఆయా దేశాల పర్మిషన్ల కోసం ఎదురుచూస్తున్నాయి.
17/ 17
మొత్తంగా కొత్త టెక్నాలజీని మనం ఆహ్వానించాల్సిందే. అందుకు ఎంత కాలం పడుతుంది అనేదే సమస్య. జపాన్‌లో రోబోలు వచ్చి చాలా దశాబ్దాలైంది. కానీ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా రోబోల వాడకం అంతంతే.. కారణం అవి సామాన్యులకు అందుబాటులో లేకపోవడమే. మరి ఈ హోవర్ వాహనాలు సామాన్యులకు ఎప్పటికి అందుబాటులోకి వస్తాయో.