1. ఈ వాచ్‌ను చూశారా? ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాచ్లల్లో ఒకటి. ఈ వాచ్ ధర 20 మిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.164 కోట్ల రూపాయలు. బిలియనీర్ వాచ్ సిరీస్‌లో భాగంగా అమెరికాకు చెందిన జ్యువెలరీ, రిస్ట్‌వాచ్ కంపెనీ అయిన జాకబ్ అండ్ కో ఈ వాచ్‌ను తయారు చేసింది. (image: Jacob & Co)
3. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో వాచెస్ అండ్ వండర్స్ యాన్యువల్ ఎగ్జిబిషన్లో ఈ ఖరీదైన వాచ్‌ను ప్రదర్శించింది జాకబ్ అండ్ కో కంపెనీ. బిలియనీర్ టైమ్‌లెస్ ట్రెజర్ పేరుతో ఈ లగ్జరీ వాచ్‌ను పరిచయం చేసింది. ముందుగా హైక్వాలిటీ ఎల్లో డైమండ్స్, రత్నాలు సేకరించి వాటిని గోల్డ్ బ్రాస్లెట్లో అమర్చింది. (image: Jacob & Co)
4. ఈ వాచ్‌లో 216.89 క్యారట్స్ డైమెండ్స్ ఉన్నట్టు కంపెనీ చెబుతోంది. కాలిడోస్కోప్ను తలపించేలా రత్నాలను కట్ చేసినట్టు కంపెనీ చెబుతోంది. బిలియనీర్ టైమ్‌లెస్ ట్రెజర్ వాచ్ తయారు చేయడానికి అత్యధిక నైపుణ్యం గల 25 మంది ప్రొఫెషనల్స్, డైమెండ్స్ రంగంలోని 10 మంది నిపుణులు, 15 మంది కళాకారులు కష్టపడ్డారని కంపెనీ చెబుతోంది. (image: Jacob & Co)
6. జాకబ్ అండ్ కో తయారు చేసిన మొదటి బిలియనీర్ వాచ్ ఇది కాదు. 2015లో మొదటి బిలియనీర్ వాచ్‌ను తయారు చేసింది. అందులో 260 క్యారట్ల వైట్ డైమండ్స్ ఉన్నాయి. 2018లో కంపెనీ 6 మిలియన్ డాలర్ల విలువైన ఎల్లో డైమండ్ మియనీర్ వాచ్‌ను తయారు చేసింది. అందులో 127 క్యారట్ల ఎల్లో డైమండ్స్ ఉన్నాయి. (image: Jacob & Co)