భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO)... తాజాగా భూమికి సంబంధించి 5 ఫొటోలను రిలీజ్ చేసింది. ఆ ఫొటోల్లో భూమి ఎరుపు రంగులో కనిపిస్తోంది. సహజంగా కనిపించే బ్లూ కలర్ బదులు ఎరుపు రంగు ఏంటని అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అంతరిక్షంలోని శాటిలైట్స్ నుంచి చూస్తే భూమి ఇలా కనిపిస్తుందని ఇస్రో తెలిపింది. (image credit - twitter - ISRO)
నిజానికి ఇవి నిజమైన భూమి కలర్స్ కావు. కానీ... EOS-06 శాటిలైట్ నుంచి భూమి ఈ రంగుల్లో కనిపించింది. ఈ శాటిలైట్‌కి ఓషన్ కలర్ మానిటర్ ఉంటుంది. దాని ద్వారా భూమి ఇలా కనిపించింది. ఆ శాటిలైట్ ఇచ్చే డేటాను తీసుకొని.. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) వారు ఇస్రోతో కలిసి... 2939 ఫొటోలను కలిపి ఈ 5 ఫొటోలను సృష్టించారు. (image credit - twitter - ISRO)
ఇంతకీ భూమికి రొటీన్ కలర్స్ కాకుండా... ఇలాంటి కలర్స్ ఎందుకు సెట్ చేశారంటే.. వీటి ద్వారా భూమి మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు.. సముద్రం లోపల ఉండే అడవుల్ని కూడా గుర్తించేందుకు వీలుగా ఈ కలర్స్ ఉన్నాయి. అందువల్ల భూమికి సంబంధించి ఇవే సరైన కలర్స్ అంటున్నారు. దీని ద్వారా లోతైన నీలి సముద్రాలు, దట్టమైన అడవులూ అన్నీ క్లియర్‌గా తెలుస్తున్నాయి అని చెబుతున్నారు. (image credit - twitter - ISRO)