1. ఈ రోజుల్లో ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నవారందరికీ గూగుల్ అకౌంట్ (Google Account) ఉండటం కామన్ అయిపోయింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గూగుల్ అకౌంట్ తప్పనిసరి. జీమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫోటోస్, యూట్యూబ్ (YouTube) లాంటి అనేక గూగుల్ సేవల్ని ఉపయోగిస్తూ ఉంటారు. గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసేప్పుడు పేరు, ఫోన్ నెంబర్, పుట్టిన తేదీ లాంటి వివరాలన్నీ ఎంటర్ చేయడం మామూలే. (ప్రతీకాత్మక చిత్రం)
2. అంతేకాదు... ఇంటి అడ్రస్, ఆఫీస్ అడ్రస్ లాంటి వివరాలు కూడా అప్డేట్ చేసేవారు ఉంటారు. అయితే గూగుల్ అకౌంట్లో ఉన్న ఈ వివరాలను కాపాడుకోవడం కూడా అవసరమే. గూగుల్ మాత్రమే కాదు... ఇలాంటి ప్లాట్‌ఫామ్స్‌లో అకౌంట్స్ క్రియేట్ చేస్తే మీ వివరాలన్నీ ఆ ప్లాట్‌ఫామ్ దగ్గర ఉంటాయి. ఆ వివరాలు లీక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇలాంటి సున్నితమైన సమాచారం లీక్ అయితే ఆ డేటా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. అప్పుడు మీ ప్రైవసీ రిస్కులో పడుతుంది. అంతేకాదు స్కామ్స్, ఫిషింగ్ ఎటాక్స్ లాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే జాగ్రత్తపడటం అవసరం. మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. గూగుల్ అకౌంట్లో ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్‌లో యూజర్లు కొన్ని మార్పులు చేయడం ద్వారా తమ అకౌంట్‌కు సంబంధించిన సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తపడొచ్చు. అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ హైడ్ చేయొచ్చు. మరి మీ గూగుల్ అకౌంట్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎలా హైడ్ చేయాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ముందుగా గూగుల్ అకౌంట్ ఓపెన్ చేయండి. మీ వివరాలతో లాగిన్ చేయండి. ఆ తర్వాత ప్రొఫైల్ పైన క్లిక్ చేసి Manage Your Google Account పైన క్లిక్ చేయండి. అందులో పర్సనల్ ఇన్ఫో ఓపెన్ చేయండి. Choose What Others See ఆప్షన్ కనిపిస్తుంది. అందులో About Me ఆప్షన్‌లోకి వెళ్లండి. అక్కడ మీ వివరాలు ఎవరికి కనిపించాలో, ఎవరికి కనిపించకూడదో సెట్టింగ్స్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. గూగుల్ అకౌంట్లో మీ వివరాలన్నీ ఎడిట్ చేసి అవసరమైన డీటెయిల్స్ మాత్రమే ఉంచండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికీ షేర్ కాకూడదు అనుకుంటే ప్రైవేట్ చేయొచ్చు. అంటే Only You అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఈ ఆప్షన్ ఎంచుకున్న వివరాలు మీకు తప్ప ఎవరికీ కనిపించవు. ఏవైనా డీటెయిల్స్ ఇతరులకు తెలియాలి అనుకుంటే Everyone సెలెక్ట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)