1. సిలిండర్ బుకింగ్‌లో పేటీఎం రికార్డులు సృష్టిస్తోంది. యూజర్లు గ్యాస్ సిలిండర్ బుక్ చేయడానికి కొన్ని నెలల క్రితం 'Book a Cylinder' సిలిండర్ పేరుతో పేటీఎం కొత్త సర్వీస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం హెచ్‌పీ గ్యాస్, ఇండియన్ ఆయిల్‌కు చెందిన ఇండేన్, భారత్ గ్యాస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ మూడు కంపెనీలకు చెందిన కస్టమర్లు ప్రస్తుతం పేటీఎంలో సిలిండర్లు బుక్ చేసుకోవచ్చు. పేటీఎంలో 'Book a Cylinder' సర్వీస్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సిలిండర్లు బుక్ అయ్యాయో తెలుసా? 50 లక్షలు. అవును... ఈ సర్వీస్ ప్రారంభమైననాటి నుంచి ఇప్పటి వరకు 50 లక్షల బుకింగ్స్ దాటినట్టు పేటీఎం ఇటీవల ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)