1. మీరు ఎక్కడికైనా రైలు టికెట్ బుక్ చేసుకున్నారా? మీ టికెట్ కన్ఫామ్ అయిందో లేదో తెలుసుకునేందుకు పదేపదే ఐఆర్సీటీసీ వెబ్సైట్ ఓపెన్ చేసి పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేస్తున్నారా? మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మీ రైలు టికెట్ కన్ఫామ్ అయిందో లేదో వాట్సప్‌లో సింపుల్‌గా తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. Railofy పేరుతో ప్రైవేట్ ప్లాట్‌ఫామ్ ఈ సేవల్ని అందిస్తోంది. వాళ్ల వాట్సప్ నెంబర్ మీ ఫోన్లో సేవ్ చేసుకొని మీ పీఎన్ఆర్ నెంబర్ స్టేటస్ సులువుగా తెలుసుకోవచ్చు. కేవలం పీఎన్ఆర్ స్టేటస్ మాత్రమే కాదు లైవ్ ట్రైన్ స్టేటస్, అంతకుముందు రైల్వే స్టేషన్, రాబోయే రైల్వే స్టేషన్ లాంటి వివరాలు తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)