1. ఐకూ ఇండియా ఐకూ జెడ్6 లైట్ (iQOO Z6 Lite) టీజర్లతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు రోజుల క్రితం రిలీజ్ చేసింది. ఐకూ జెడ్6 సిరీస్‌లో భాగంగా ఈ మొబైల్‌ను తీసుకొస్తోంది కంపెనీ. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఐకూ జెడ్6 ప్రో (iQOO Z6 Pro), ఐకూ జెడ్6 44W, ఐకూ జెడ్6 మోడల్స్ ఉన్నాయి. ఇదే సిరీస్‌లో నాలుగో ఫోన్ ఐకూ జెడ్6 లైట్ వచ్చేసింది. (image: iQoo India)
2. క్వాల్కమ్ నుంచి వచ్చిన ఎంట్రీలెవెల్ 5జీ చిప్సెట్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్‌తో రిలీజైన తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే. ఇందులో 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. రూ.15,000 లోపు బడ్జెట్లోని 5జీ స్మార్ట్ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది ఐకూ జెడ్6 లైట్. ఈ స్మార్ట్‌ఫోన్ ధరను ప్రకటించింది కంపెనీ. ప్రారంభ ధర రూ.13,999 కాగా ఆఫర్లో బేస్ వేరియంట్‌ను రూ.11,499 ధరకే కొనొచ్చు. (image: iQoo India)
4. అమెజాన్‌లో ఎస్బీఐ బ్యాంక్ కార్డుతో ఐకూ జెడ్6 లైట్ కొంటే రూ.2,500 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో ఐకూ జెడ్6 లైట్ 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.11,499 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.12,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 14, 15 తేదీల్లో మాత్రమే లభిస్తుంది. స్టెల్లార్ గ్రీన్, మిస్టిక్ నైట్ కలర్స్‌లో కొనొచ్చు. (image: iQoo India)
6. ఐకూ జెడ్6 లైట్ ఆండ్రాయిడ్ 12 + ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. రెండేళ్లు ఆండ్రాయిడ్ అప్డేట్స్, మూడేళ్లు సెక్యురిటీ ప్యాచెస్ ఇస్తామని కంపెనీ చెబుతోంది. ఇందులో ర్యామ్ బూస్టర్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్‌తో 2జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. అల్ట్రా గేమ్ మోడ్ లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. (image: iQoo India)
7. ఐకూ జెడ్6 లైట్ కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో వెనుకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్సులో ఛార్జర్ లభించదు. రూ.399 చెల్లించి 18వాట్ ఛార్జర్ కొనాల్సి ఉంటుంది. (image: iQoo India)