1. ఐకూ ఇండియా మూడు నెలల క్రితం ఐకూ జెడ్6 5జీ (iQOO Z6 5G) స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఇందులో ఇటీవల బాగా పాపులర్ అయిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 (Snapdragon 695) ప్రాసెసర్ ఉండటం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అమెజాన్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. అమెజాన్ కూపన్ ఆఫర్‌తో పాటు బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. (image: iQOO India)
2. ఐకూ జెడ్6 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయినప్పుడు ధరలు చూస్తే 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999. అమెజాన్ కూపన్, బ్యాంక్ ఆఫర్‌తో బేస్ వేరియంట్‌ను రూ.12,999 ధరకు కొనొచ్చు. (image: iQOO India)
3. ప్రస్తుతం అమెజాన్‌లో ధరలు చూస్తే 4జీబీ+128జీబీ వేరియంట్ రూ.14,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.16,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.17,999 ధరకు లిస్ట్ అయింది. అమెజాన్ కూపన్ ద్వారా రూ.500, ఎస్బీఐ కార్డుతో 10 శాతం తగ్గింపు, హెచ్ఎస్బీసీ క్యాష్‌బ్యాక్ కార్డుతో 5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. (image: iQOO India)
4. ఐకూ జెడ్6 5జీ స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్‌ను ఛార్జర్ లేకుండా కొంటే రూ.12,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇప్పటికే అదనంగా ఛార్జర్ ఉన్నవారు ఈ ఆఫర్ ద్వారా తక్కువ ధరకే ఐకూ జెడ్6 5జీ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. ఈఎంఐ ద్వారా కొనాలనుకునేవారికి రూ.3,000 నుంచి నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది. (image: Amazon India)
5. ఐకూ జెడ్6 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో ఎక్స్టెండెడ్ ర్యామ్ 2.0 ఫీచర్ ఉంది. ఈ ఫీచర్‌తో 4జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 12 + ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఐకూ జెడ్6 స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. (image: iQOO India)
6. ఐకూ జెడ్6 స్మార్ట్‌ఫోన్‌లో 50మెగాపిక్సెల్ Samsung ISOCELL JN1 మెయిన్ కెమెరా + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2మెగాపిక్సెల్ బొకే సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. క్రోమాటిక్ బ్లూ, డైనమో బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. (image: iQOO India)