1. ఐకూ జెడ్ సిరీస్‌లో ఇండియాలో వరుసగా స్మార్ట్ఫోన్లు రిలీజ్ అయ్యాయి. కొద్ది రోజుల క్రితం ఐకూ జెడ్6 5జీ (iQoo Z6 5G) స్మార్ట్‌ఫోన్ రిలీజైన సంగతి తెలిసిందే. ఇదే సిరీస్‌లో ఐకూ జెడ్6 4జీ (iQoo Z6 4G), ఐకూ జెడ్6 ప్రో 5జీ (iQoo Z6 Pro 5G) మోడల్స్‌ని కూడా రిలీజ్ చేసింది. ఐకూ జెడ్6 4జీ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 (Snapdragon 680) ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 44వాట్ ఫ్లాష్‌ఛార్జ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. (image: iQoo India)
2. ఐకూ జెడ్6 4జీ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో రిలీజైంది. 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.16,999. ఆఫర్లో బేస్ వేరియంట్‌ను రూ.13,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: iQoo India)
3. అమెజాన్ సమ్మర్ సేల్‌లో భాగంగా మరో రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో ఈ డిస్కౌంట్ పొందొచ్చు. ఆఫర్స్ అన్నీ కలిపి 4జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.12,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.13,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.15,499 ధరకు సొంతం చేసుకోవచ్చు. అమెజాన్, ఐకూ ఇండియా ఇస్టోర్‌లో కొనొచ్చు. (image: iQoo India)
4. ఐకూ జెడ్6 4జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ ఇటీవల లాంఛ్ అయిన మోటో జీ52 స్మార్ట్‌ఫోన్‌తో పాటు రెడ్మీ 10 పవర్, రియల్మీ 9 4జీ, ఒప్పో కే10, రెడ్మీ 10, రెడ్మీ నోట్ 11, వివో వై33టీ, రియల్మీ 9ఐ మొబైల్స్‌లో ఉంది. (image: iQoo India)
5. ఐకూ జెడ్6 4జీ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2మెగాపిక్సెల్ బొకే సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. రియర్ కెమెరాలో నైట్ మోడ్, పోర్ట్రైట్, 50ఎంపీ ఫోటో, వీడియో, డాక్ కరెక్షన్, డబుల్ ఎక్స్పోజర్, టైమ్ ల్యాప్స్, స్లోమో లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: iQoo India)
6. ఐకూ జెడ్6 4జీ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో నైట్ మోడ్, పోర్ట్రైట్, ఫోటో, వీడియో, మల్టీ స్టైల్ పోర్ట్రైట్, డ్యూయెల్ వ్యూ వీడియో, ఏఆర్ స్టిక్కర్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 44వాట్ ఫ్లాష్‌ఛార్జ్ సపోర్ట్ లభిస్తుంది. 27 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ చేయొచ్చు. 71 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ చేయొచ్చు. (image: iQoo India)
7. ఐకూ జెడ్6 4జీ స్మార్ట్‌ఫోన్‌లో ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్‌తో 12జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 12 + ఫన్‌టచ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్ సీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. లుమీనా బ్లూ, రావెన్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. (image: iQoo India)