1. అమెజాన్‌లో ఐకూ స్మార్ట్ఫోన్లపై ఆఫర్స్ ఉన్నాయి. ఐకూ క్వెస్ట్ డేస్ సేల్‌లో భాగంగా ఐకూ మోడల్స్‌పై డిస్కౌంట్స్ ఉన్నాయి. ఈ సేల్‌లో ఈ ఏడాది రిలీజ్ అయిన ఐకూ జెడ్5 స్మార్ట్‌ఫోన్‌పై రూ.5,000 తగ్గింపు పొందొచ్చు. దీంతో పాటు పలు బ్యాంకు కార్డులపైనా తగ్గింపు ఆఫర్స్ ఉన్నాయి. కాబట్టి కస్టమర్లకు మరింత డిస్కౌంట్ లభిస్తుంది. (image: IQOO India)
2. ఐకూ జెడ్5 స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,990 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,990. అమెజాన్ నుంచి రూ.2,000 కూపన్ డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ద్వారా కొనేవారికి అదనంగా రూ.3,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై మొత్తం రూ.5,000 డిస్కౌంట్ పొందొచ్చు. (image: IQOO India)
3. ఇక బ్యాంక్ ఆఫర్స్ విషయానికి వస్తే యాక్సిస్ మైల్స్, ఇతర క్రెడిట్ కార్డులతో కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ గరిష్టంగా రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్‌తో కొంటే 7.5 శాతం గరిష్టంగా రూ.1,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక సిటీ యూనియన్ బ్యాంక్ డెబిట్ మాస్టర్ కార్డుతో కొంటే రూ.150 తగ్గింపు లభిస్తుంది. హెచ్ఎస్బీసీ క్యాష్‌బ్యాక్ కార్డుతో కొంటే 5 శాతం తగ్గింపు లభిస్తుంది. (image: IQOO India)
4. అమెజాన్‌లో ఐకూ క్వెస్ట్ డేస్ సేల్ డిసెంబర్ 16న ముగుస్తుంది. అప్పటివరకు ఈ ఆఫర్ పొందొచ్చు. ఆ తర్వాత ఆఫర్స్ ఉండకపోవచ్చు. ఇక ఐకూ జెడ్5 విశేషాలు చూస్తే ఈ స్మార్ట్‌ఫోన్ దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్లో లాంఛ్ అయింది. సేల్ సమయంలో ధర ఇంతే ఉన్నా ఆఫర్స్ తక్కువగా లభించాయి. ఇప్పుడు ఏకంగా రూ.5,000 వరకు డిస్కౌంట్ లభించడం విశేషం. (image: IQOO India)
5. ఐకూ జెడ్5 స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన ప్రాసెసర్ ఇది. ఈ ప్రాసెసర్‌తో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్, సాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ, షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ, మోటోరోలా ఎడ్జ్ 20 స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి. (image: IQOO India)
6. ఐకూ జెడ్5 స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే 64మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + ఫన్‌టచ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ర్యామ్ ఎక్స్‌ప్యాండ్ చేసే ఫీచర్ కూడా ఉంది. (image: IQOO India)
7. ఐకూ జెడ్5 స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 44వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లూటూత్ 5.2 వర్షన్, యూఎస్బీ ఓటీజీ, ట్రైబ్యాండ్ వైఫై, 3.5ఎంఎం ఆడియో జాక్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: IQOO India)