iQOO Z3 5G: ఐకూ జెడ్3 5జీ స్మార్ట్‌ఫోన్ అసలు ధర చూస్తే 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,990 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.20,990. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ+256జీబీ ధర రూ.22,990. ఆఫర్లో 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.17,990 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.18,990 ధరకు, 8జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.20,990 ధరకు కొనొచ్చు. (image: IQOO India)
iQOO Z3 5G: ఐకూ జెడ్3 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 768జీ ప్రాసెసర్, 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4,400ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 55వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 5జీ, 4జీ ఎల్టీఈ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: IQOO India)
iQOO Z5 5G: ఐకూ జెడ్5 స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్, 64మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 44వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: IQOO India)
iQOO 7: ఐకూ 7 5జీ స్మార్ట్‌ఫోన్ అసలు ధర చూస్తే 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.29,990 కాగా, 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.31,990. ఇక హైఎండ్ వేరియంట్ 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.33,990. అమెజాన్ కూపన్ ద్వారా రూ.3,000 డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ ఆఫర్ కలిపి బేస్ వేరియంట్‌ను రూ.23,990 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: IQOO India)
iQOO 7: ఐకూ 7 5జీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.62 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్, 8మెగాపిక్సెల్ Sony IMX598 సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4,400ఎంఏహెచ్ బ్యాటరీ, 66వాట్ ఫ్లాష్‌ఛార్జ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: IQOO India)