1. ఐకూ నుంచి త్వరలో ఐకూ 10 ప్రో (iQOO 10 Pro) స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. ఇప్పటికే ఐకూ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఉంది. త్వరలో ఐకూ 10 ప్రో మొబైల్ రిలీజ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 200వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రానుందన్న వార్తలొస్తున్నాయి. ఈ ఛార్జర్‌తో స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 15 నిమిషాల లోపు 100 శాతం ఛార్జింగ్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఐకూ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ వచ్చే నెలలో చైనాలో రిలీజ్ కానుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్+ 1 ప్రాసెసర్, 200వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలు ఉండబోతున్నాయి. 0 నుంచి 100 శాతం వరకు నిమిషాల్లో ఛార్జింగ్ అవుతుంది. గతంలో షావోమీ కూడా 200వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని పరిచయం చేసింది. కానీ 200వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఇంకా స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేయలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
3. షావోమీ కన్నా ముందే ఐకూ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ 200వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రానుండటం విశేషం. ఇంత ఫాస్ట్ ఛార్జింగ్‌తో రాబోయే తొలి స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే. ఇక ఇందులో LTPO 2K అమొలెడ్ డిస్ప్లే, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ లాంటి ఫీచర్స్ కూడా ఉండబోతున్నాయి. 50 మెగాపిక్సెల్ సెన్సార్‌తో కెమెరా సెటప్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఐకూ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 4,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటే కేవలం 10 నుంచి 12 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్ చేయొచ్చు. అంతకన్నా ఎక్కువ బ్యాటరీ ఉంటే 15 నిమిషాల్లో ఛార్జింగ్ చేయొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌కు 65వాట్ వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభించనుంది. వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడా గంట లోపే ఫుల్ ఛార్జింగ్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఐకూ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి ఫీచర్స్ తెలియాల్సి ఉంది. 200వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రావడం దాదాపు ఖాయమైంది. చైనాలో వచ్చే నెలలో స్మార్ట్‌ఫోన్ రిలీజైతే మిగతా ఫీచర్స్ తెలుస్తాయి. ఇప్పటికే ఐకూ 9 స్మార్ట్‌ఫోన్ 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను 0 నుంచి 100 శాతం కేవలం 18 నిమిషాల్లో ఛార్జ్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఐకూ 9 ప్రో ఫీచర్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల 2K E5 అమొలెడ్ డిస్ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4,700ఎంఏహెచ్ బ్యాటరీ, 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 50వాట్ ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఐకూ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే గింబాల్ స్టెబిలైజేషన్‌తో 50 మెగాపిక్సెల్ GN5 ప్రైమరీ కెమెరా + 50 మెగాపిక్సెల్ 150డిగ్రీ వైడ్ యాంగిల్ ఫిష్ఐ సెన్సార్ + 16మెగాపిక్సెల్ పోర్ట్రైట్ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.64,990 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.69,990. (ప్రతీకాత్మక చిత్రం)