తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ఫోన్లను అందిస్తూ, ఇండియన్ మార్కెట్లో దూసుకుపోతోంది టెక్ బ్రాండ్ ఐక్యూ. ఈ కంపెనీ బడ్జెట్ ఫోన్లతో పాటు మిడ్‌రేంజ్ ఫోన్లను వరుసగా మార్కెట్లోకి లాంచ్ చేస్తోంది. తాజాగా మరో మిడ్‌రేంజ్ ఫోన్‌ను చైనీస్ మార్కెట్లోకి అధికారికంగా రిలీజ్ చేసింది. ఐక్యూ నియో 7 (iQOO Neo 7) పేరుతో తీసుకొచ్చిన ఈ డివైజ్‌లో లేటెస్ట్ చిప్సెట్తో పాటు, 120Hz AMOLED డిస్ప్లే, 120W ఛార్జింగ్ కెపాసిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర, ఫీచర్ల వివరాలు తెలుసుకుందాం.
ఐక్యూ నియో 7 డివైజ్ 20:8 యాస్పెక్ట్ రేషియో, 1,500 నిట్స్ బ్రైట్నెస్కు సపోర్ట్ చేసే 6.78 అంగుళాల FHD+ E5 AMOELD శామ్సంగ్ ప్యానెల్‌తో వస్తుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ప్యానెల్ HDR10+, DCI-P3 కలర్ గామాట్కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ OriginOS Oceanతో రన్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)