1. ఐకూ ఇండియా గతేడాది ఐకూ 9 సిరీస్‌లో (iQOO 9 Series) ఐకూ 9, ఐకూ 9 ప్రో, ఐకూ 9 ఎస్ఈ మోడల్స్ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో ఐకూ 9 ఎస్ఈ ధర భారీగా తగ్గింది. ఏకంగా రూ.3,000 ధర తగ్గించింది ఐకూ ఇండియా. అమెజాన్‌లో కొనేవారికి బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఈ ఆఫర్స్‌తో ధర ఇంకా తగ్గుతుంది. (image: iQOO India)
3. అమెజాన్‌లో పలు బ్యాంకుల కార్డులతో కొంటే మరింత డిస్కౌంట్ పొందొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులపై రూ.3,000 ఇన్స్టంట్ డిస్కౌంట్, స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1500 డిస్కౌంట్, హెచ్ఎస్బీసీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ ఆఫర్ రూ.1300 నుంచి ప్రారంభం అవుతుంది. (image: iQOO India)
4. ఐకూ 9 ఎస్ఈ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.62 అంగుళాల అమొలెడ్ డిస్ప్లే ఉంది. ఇందులో ఆప్టికల్ ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఐకూ 9 ఎస్ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 + ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: iQOO India)
5. ఐకూ 9 ఎస్ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే 48మెగాపిక్సెల్ Sony IMX598 ప్రైమరీ కెమెరా + 13మెగాపిక్సెల్ 120డిగ్రీ అల్ట్రావైడ్ మ్యాక్రో కెమెరా + 2మెగాపిక్సెల్ మోనో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. (image: iQOO India)
6. ఐకూ 9 ఎస్ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 66వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో 8 5జీ బ్యాండ్స్ సపోర్ట్ లభిస్తుంది. సన్‌సెట్ సియారా, స్పేస్ ఫ్యూజన్ కలర్స్‌లో కొనొచ్చు. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే వైఫై, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్ సీ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. (image: iQOO India)