1. అమెజాన్‌లో ఐకూ క్వెస్ట్ డేస్ (iQoo Quest Days) సేల్ కొనసాగుతోంది. ఈ సేల్‌లో ఐకూ జెడ్3 5జీ, ఐకూ జెడ్5 5జీ, ఐకూ 7 5జీ స్మార్ట్ఫోన్లపై భారీగా డిస్కౌంట్ ఆఫర్స్ ఉండటం విశేషం. మరోవైపు ఐకూ 7 5జీ, ఐకూ జెడ్3 5జీ స్మార్ట్ఫోన్ల ధరల్ని శాశ్వతంగా తగ్గించింది ఐకూ. ఈ రెండు స్మార్ట్ఫోన్లపై రూ.2,000 తగ్గింపు ప్రకటించింది. (image: iQoo India)
2. ఐకూ జెడ్3 5జీ స్మార్ట్‌ఫోన్ అసలు ధర వివరాలు చూస్తే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,990 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,990. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.22,990. ఇప్పుడు ఈ మూడు వేరియంట్లపై రూ.2,000 ధర తగ్గడం విశేషం. (image: iQoo India)
3. ధర తగ్గిన తర్వాత ఐకూ జెడ్3 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.17,990 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.18,990 ధరకు, 8జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.20,990 ధరకు కొనొచ్చు. అమెజాన్ కూపన్ ఆఫర్ ద్వారా రూ.2,000 తగ్గింపు లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ద్వారా కొనేవారికి రూ.15,000 వరకు డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్. (image: Amazon India)
4. ఐకూ జెడ్3 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 768జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 11 + ఫన్‌టచ్ ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది. (image: iQoo India)
5. ఐకూ జెడ్3 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండటం విశేషం. 64 మెగాపిక్సెల్ GW3 సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్‌తో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. (image: iQoo India)
7. ఐకూ క్వెస్ట్ డేస్ సేల్‌లో ఐకూ జెడ్3 5జీ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఐకూ జెడ్5 5జీ, ఐకూ 7 5జీ స్మార్ట్ఫోన్లపై పైనా ఆఫర్స్ ఉన్నాయి. ఐకూ జెడ్5 5జీ స్మార్ట్‌ఫోన్ ఆఫర్ ధర చూస్తే 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.21,990 ధరకు, 12జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.24,990 ధరకు కొనొచ్చు. ఇక ఐకూ 7 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.27,990 ధరకు, 8జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.29,990 ధరకు, 12జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.31,990 ధరకు కొనొచ్చు. (image: iQoo India)