1. ఐకూ 9 సిరీస్‌లో (iQOO 9 Series) ఐకూ ఇండియా ఐకూ 9 (iQOO 9), ఐకూ 9 ప్రో (iQOO 9 Pro), ఐకూ 9 ఎస్ఈ (iQOO 9 SE) మోడల్స్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్‌లో మూడు స్మార్ట్ఫోన్ల సేల్ కొనసాగుతోంది. వీటిలో ఐకూ 9 స్మార్ట్‌ఫోన్‌పై రూ.7,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. (image: iQOO India)
2. ఐకూ 9 స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.42,990 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.46,990. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.4,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ద్వారా ఐకూ 9 కొనేవారికి రూ.3,000 అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్‌తో మొత్తం రూ.7,000 డిస్కౌంట్ పొందొచ్చు. (image: iQOO India)
3. అమెజాన్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కలిపి ఐకూ 9 స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.35,990 ధరకు, 12జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.39,990 ధరకు సొంతం చేసుకోవచ్చు. ఇక అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.500 ఇన్స్టంట్ డిస్కౌంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మిలీనియా క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్, హెచ్ఎస్బీసీ క్యాష్‌బ్యాక్ కార్డుతో కొంటే 5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. (image: iQOO India)
4. ఐకూ 9 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో అమొలెడ్ డిస్ప్లే ఉంది. ఇందులో ఆప్టికల్ ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888+ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ వివో ఎక్స్70 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఉంది. (image: iQOO India)
5. ఐకూ 9 స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే 48మెగాపిక్సెల్ Sony IMX598 మెయిన్ గింబాల్ కెమెరా + 13మెగాపిక్సెల్ 120డిగ్రీ అల్ట్రావైడ్ మ్యాక్రో కెమెరా + 13మెగాపిక్సెల్ పోర్ట్రైట్ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. రియర్ కెమెరాలో నైట్ మోడ్, పోర్ట్రైట్, ఫోటోగ్రఫీ, వీడియో, పనో, లైవ్ ఫోటో, స్లోమో, టైమ్ ల్యాప్స్, ప్రోమోడ్, ఏఆర్ స్టిక్కర్స్, ఎక్స్‌స్ట్రీమ్ నైట్ విజన్, డాక్ కరెక్షన్, ప్రో స్పోర్ట్స్ మోడ్, అల్ట్రా స్టేబుల్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: iQOO India)