1. ఐకూ 9 సిరీస్‌లో (iQOO 9 Series) ఇటీవల ఐకూ 9 (iQOO 9), ఐకూ 9 ప్రో (iQOO 9 Pro), ఐకూ 9 ఎస్ఈ (iQOO 9 SE) మోడల్స్ రిలీజ్ అయ్యాయి. సేల్ కూడా ప్రారంభమైంది. వీటిలో ఐకూ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది. (image: iQOO India)
3. ఐకూ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.64,990 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.69,990. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.6,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా రూ.4,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. మొత్తం కలిపి రూ.10,000 డిస్కౌంట్ లభిస్తుంది. (image: iQOO India)
4. కస్టమర్లకు బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ వర్తిస్తే ఐకూ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ 8జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.54,990 ధరకు, 12జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.59,990 ధరకు సొంతం చేసుకోవచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మిలీనియా క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్, హెచ్ఎస్బీసీ క్యాష్‌బ్యాక్ కార్డుతో కొంటే 5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. (image: iQOO India)
5. ఐకూ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 3D కర్వ్డ్ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల 2K E5 అమొలెడ్ డిస్ప్లే ఉంది. అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే సెన్సార్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ ఇటీవల రిలీజైన మోటో ఎడ్జ్ 30 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో పాటు సాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ స్మార్ట్ఫోన్లలో ఉంది. (image: iQOO India)
6. ఐకూ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 14 5జీ బ్యాండ్స్ సపోర్ట్ ఉండటం విశేషం. 4,700ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 50వాట్ ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఛార్జర్ వేరుగా కొనుక్కోవాలి. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 + ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: iQOO India)
7. ఐకూ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే గింబాల్ స్టెబిలైజేషన్‌తో 50 మెగాపిక్సెల్ GN5 ప్రైమరీ కెమెరా + 50 మెగాపిక్సెల్ 150డిగ్రీ వైడ్ యాంగిల్ ఫిష్ఐ సెన్సార్ + 16మెగాపిక్సెల్ పోర్ట్రైట్ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. రియర్ కెమెరాలో నైట్ మోడ్, పోర్ట్రైట్, ఫోటోగ్రఫీ, వీడియో, పనో, స్లోమో, టైమ్ ల్యాప్స్, ప్రోమోడ్, ఏఆర్ స్టిక్కర్స్, డాక్, ప్రో స్పోర్ట్స్, డ్యూయెల్ వ్యూ వీడియో లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: iQOO India)
8. ఐకూ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. పోర్ట్రైట్, ఫోటో, వీడియో, డైనమిక్ ఫోటో, ఏఆర్ స్టిక్కర్స్, డబుల్ ఎక్స్పోజర్, డబుల్ వ్యూ వీడియో లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను లెజెండ్, డార్క్ క్రూజ్ కలర్స్‌లో కొనొచ్చు. (image: iQOO India)