1. ఐకూ 9 ఫీనిక్స్ ఆరెంజ్ వేరియంట్ ఇండియాలో రిలీజైంది. ఇప్పటికే లెజండ్ గ్రే, ఆల్ఫా బ్లాక్ కలర్స్‌లో ఐకూ 9 రిలీజైన సంగతి తెలిసిందే. లేటెస్ట్గా ఐకూ 9 ఫీనిక్స్ ఆరెంజ్ కలర్లో వచ్చింది. రంగు మారుతూ ఉండటం ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత. కలర్ ఛేంజింగ్ టెక్నాలజీని ఉపయోగించింది ఐకూ. ఫ్రాస్టీ ఏజీ గ్లాస్ సాయంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించడం విశేషం. (image: iQOO India)
2. సూర్యకాంతి పడ్డప్పుడు, ఆర్టిఫిషియల్ యూవీ రేస్ పడ్డప్పుడు స్మార్ట్‌ఫోన్ వేర్వేరు కలర్స్‌లోకి మారుతుంది. తెలుపు నుంచి ఆరెంజ్ కలర్‌కు మారుతూ వేర్వేరు రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్ కనిపిస్తుంది. అల్ట్రా వయొలెట్ కిరణాలు గాజు అణువుల అంతర్గత నిర్మాణాన్ని మార్చడం కారణంగా స్మార్ట్‌ఫోన్ కలర్ మారుతుందని కంపెనీ తెలిపింది. (image: iQOO India)
3. ఇప్పటికే రిలీజైన ఐకూ 9 స్మార్ట్‌ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్‌లో ఎలాంటి మార్పు లేదు. కేవలం ఐకూ 9 ఫీనిక్స్ ఆరెంజ్ వేరియంట్లో మాత్రమే రిలీజైంది. ఐకూ 9 స్మార్ట్‌ఫోన్ ఫీనిక్స్ ఆరెంజ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.42,990 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.46,990. (image: iQOO India)
6. ఐకూ 9 స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే 48మెగాపిక్సెల్ Sony IMX598 మెయిన్ గింబాల్ కెమెరా + 13మెగాపిక్సెల్ 120డిగ్రీ అల్ట్రావైడ్ మ్యాక్రో కెమెరా + 13మెగాపిక్సెల్ పోర్ట్రైట్ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. (image: iQOO India)