గతంలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 చిప్సెట్తో వచ్చిన మోడల్ కంటే ప్రస్తుతం లాంచ్ చేసిన ఈ ఫోన్ 20 శాతం ఎక్కువ పర్ఫామెన్స్ ఇస్తుందని ఐక్యూ బ్రాండ్ వెల్లడించింది. ఐక్యూ 11 మోడల్స్ భారత్‌లో జనవరి13న మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రైబర్లు రూ.1000 డిస్కౌంట్‌తో ఒకరోజు ముందుగానే, అంటే జనవరి 12న డివైజ్‌ను బుక్ చేసుకొని, కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ లెజెండ్, అల్ఫా వేరియంట్ కలర్లలో మాత్రమే అవైలబుల్గా ఉంది.
ధర ఎంత?
ఐక్యూ 11 స్మార్ట్‌ఫోన్ ధర రూ.59,999 నుంచి ప్రారంభమవుతుంది. RAM, మెమరీని బట్టి ధర మారుతూ ఉంటుంది. 8 GB + 256 GB వేరియంట్ ధర రూ.59,999గా ఉంది. 16 GB + 256 GB మోడల్ ధర రూ.64,999 వరకు ఉంటుంది. బ్యాంకులు అందించే వివిధ ఆఫర్ల ద్వారా ఈ రెండు వేరియంట్ల ధరలు వరుసగా రూ.51,999, రూ.56,999కు అందుబాటులో ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
* ఫీచర్లు ఇవే..
ఐక్యూ 11 ఫోన్క్ష ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సల్ శామ్సంగ్ జీఎన్5 లెన్స్, 13 మెగా పిక్సెల్ టిలిఫోటో లెన్స్, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్‌తో పాటు 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాతో డివైజ్ బెస్ట్ అవుట్‌పుట్ అందిస్తుంది. దీంట్లో 5000mAh బ్యాటరీ ఉంటుంది. 120wతో మొబైల్ ఫాస్ట్ చార్జ్ అవుతుంది.