1. Jio Rs 499 Plan: రిలయెన్స్ జియో కొత్తగా ప్రకటించిన ప్లాన్ ఇది. కేవలం డేటా టాప్ అప్ ప్లాన్ మాత్రమే. రూ.499 రీఛార్జ్ చేస్తే రోజూ 1.5జీబీ 4జీ డేటా లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్‌కు ఇది వర్తిస్తుంది. ఈ ప్లాన్ వేలిడిటీ 56 రోజులు. రోజూ 1.5 జీబీ డేటా చొప్పున 84జీబీ 4జీ డేటా వాడుకోవచ్చు. రూ.499 రీఛార్జ్ చేస్తే రూ.399 విలువైన ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. Jio Rs 401 Plan: జియో గతంలో ప్రకటించిన ప్లాన్ ఇది. రూ.401 ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజుకు 3జీబీ చొప్పున 84జీబీ డేటాతో పాటు అదనంగా 6జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 90 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ కాల్స్, జియో నుంచి ఇతర నెట్వర్క్స్కు 1000 నిమిషాలు మాట్లాడొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు ఉపయోగించుకోవచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్స్క్రిప్షన్ ఉచితం. (ప్రతీకాత్మక చిత్రం)
3. Jio Rs 777 Plan: ఇది కూడా ఐపీఎల్ సందర్భంగా జియో ప్రకటించిన ప్లాన్. రూ.777 రీఛార్జ్ చేస్తే రోజూ 1.5జీబీ 4జీ డేటా 84 రోజుల పాటు లభిస్తుంది. అదనంగా మరో 5జీబీ డేటా కూడా పొందొచ్చు. అంటే మొత్తం 131జీబీ డేటా వాడుకోవచ్చు. జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. జియో నుంచి నాన్ జియోకు 3000 నిమిషాల కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌కు కూడా రూ.399 విలువైన ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. Jio Rs 2599 Plan: రిలయెన్స్ జియో రూ.2599 ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజుకు 2జీబీ చొప్పున 730జీబీ డేటాతో పాటు అదనంగా 10జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 740 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ కాల్స్, జియో నుంచి ఇతర నెట్వర్క్స్కు 12000 నిమిషాలు మాట్లాడొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు ఉపయోగించుకోవచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్స్క్రిప్షన్ ఉచితం. (ప్రతీకాత్మక చిత్రం)
8. Jio Rs 612 Plan: రిలయెన్స్ జియో రూ.612 యాడ్ ఆన్ ప్లాన్. అంటే ప్రస్తుతం ఏదైనా ప్లాన్‌లో ఉన్నవారు మాత్రమే ఈ ప్లాన్ రీఛార్జ్ చేయాలి. వారికి రూ.51 విలువైన 12 వోచర్లు వస్తాయి. 6జీబీ డేటా లభిస్తుంది. జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ కాల్స్, జియో నుంచి ఇతర నెట్వర్క్స్కు 6000 నిమిషాలు మాట్లాడొచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్స్క్రిప్షన్ ఉచితం. జియో యాప్స్ కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)