1. యాపిల్ రెండు నెలల క్రితం ఇండియాలో ఐఫోన్ ఎస్ఈ 2022 (iPhone SE 2022) మోడల్‌ను లాంఛ్ చేసింది. ఈ మోడల్‌నే ఐఫోన్ ఎస్ఈ 3 (iPhone SE 3) అని కూడా పిలుస్తారు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై యాపిల్ ఇండియా స్టోర్‌లో అద్భుతమైన ఆఫర్ ఉంది. కేవలం రూ.30,000 లోపే ఐఫోన్ ఎస్ఈ 3 మోడల్‌ను సొంతం చేసుకోవచ్చు. (image: Apple India)
2. ఐఫోన్ ఎస్ఈ 3 స్మార్ట్‌ఫోన్ ధరలు చూస్తే ప్రస్తుతం 64జీబీ వేరియంట్ ధర రూ.43,900 కాగా, 128జీబీ వేరియంట్ ధర రూ.48,900. ఇక హైఎండ్ వేరియంట్ 256జీబీ మోడల్ ధర రూ.58,900. ఎక్స్ఛేంజ్ ఆఫర్, బ్యాంక్ డిస్కౌంట్ ద్వారా కొంటే ఈ స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్‌ను రూ.29,900 ధరకే సొంతం చేసుకోవచ్చు. (image: Apple India)
3. యాపిల్ ఆన్లైన్ స్టోర్‌లో కొంటేనే ఈ ఆఫర్ లభిస్తుంది. అయితే ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఎంత వస్తుందనేది మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ వ్యాల్యూపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎక్స్ఛేంజ్లో ఐఫోన్ ఎస్ఈ 3 స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేసేప్పుడు కస్టమర్లు తమ మొబైల్‌కు ఎక్స్ఛేంజ్ వ్యాల్యూ ఎంత వస్తుందని చెక్ చేయడం అవసరం. (image: Apple India)
4. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఐఫోన్ ఎస్ఈ 3 స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్లో కొనేవారికి వారి పాత మొబైల్‌పై రూ.16,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఒకవేళ ఫ్లిప్‌కార్ట్ కస్టమర్‌కు రూ.16,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ వర్తిస్తుందే రూ.28,900 చెల్లించి ఐఫోన్ ఎస్ఈ 3 కొనొచ్చు. (image: Apple India)
5. గతంలో ఉన్న ఐఫోన్ ఎస్ఈ లాగానే ఐఫోన్ ఎస్ఈ 3 మోడల్ ఉండటం విశేషం. స్పెసిఫికేషన్స్‌లో స్వల్ప మార్పులున్నాయి. ఐఫోన్ ఎస్ఈ 3 లేటెస్ట్ ఐఓఎస్ వర్షన్‌తో వస్తుంది. 5జీ సపోర్ట్ కూడా ఉంది. 5జీ సపోర్ట్ ఉన్న చీపెస్ట్ ఐఫోన్ ఇదే. ఐఫోన్ ఎస్ఈ సిరీస్‌లో 5జీ సపోర్ట్ లభిస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే. (image: Apple India)
6. ఐఫోన్ ఎస్ఈ 2022 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 4.7 అంగుళాల డిస్ప్లే ఉంది. ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం, గ్లాస్ డిజైన్‌తో ఉండటం విశేషం. ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 స్మార్ట్ఫోన్లలో ఉన్నట్టు ఐఫోన్ ఎస్ఈ 2022 స్మార్ట్‌ఫోన్‌లో కూడా ముందు, వెనుకవైపు టఫెస్ట్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. (image: Apple India)
7. ఐఫోన్ ఎస్ఈ 2022 స్మార్ట్‌ఫోన్‌లో ఫేస్ ఐడీ లేదు. టచ్ ఐడీ మాత్రమే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఏ15 బయోనిక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్‌లో ఇదే ప్రాసెసర్ ఉంది. పాత మోడల్ కన్నా బ్యాటరీ లైఫ్ ఎక్కువగా వస్తుందని కంపెనీ చెబుతోంది. వైర్‌సెల్ ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. (image: Apple India)
8. ఐఫోన్ ఎస్ఈ 2022 స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో 12మెగాపిక్సెల్ వైడ్ కెమెరా ఉంది. స్మార్ట్ హెచ్డీఆర్, ఫోటోగ్రఫిక్ స్టైల్స్, డీప్ ఫ్యూజన్, పోర్ట్రైట్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఐఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఉండటం విశేషం. చాలావరకు ఫీచర్స్ ఐఫోన్ 13 సిరీస్‌లో ఉన్నట్టుగానే ఉన్నాయి. (image: Apple India)