ఐస్టోర్ ఇండియా ఐఫోన్ ఎస్ఈ 3పై తీసుకొచ్చింది ఫ్లాట్ డిస్కౌంట్ (Flat Discount) కాదని కొనుగోలుదారులు గుర్తించుకోవాలి. ఇన్స్టంట్ స్టోర్ డిస్కౌంట్‌తో పాటు క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల తర్వాతనే ఐఫోన్ ఎస్ఈ 3 ధర రూ.28,900కి దిగి వస్తుందని కొనుగోలుదారులు గుర్తు పెట్టుకోవాలి. ఐస్టోర్ సైట్ రూ.13,000 ఎక్స్చేంజ్ వాల్యూతో పాటు ఇన్స్టంట్ డిస్కౌంట్ కింద రూ.2,000 ఆఫర్ చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
యాపిల్ తన పీక్ పెర్ఫార్మెన్స్ (Peak Performance) ఈవెంట్ 2022 సందర్భంగా మార్చి 8న ఐఫోన్ ఎస్ఈ 3ని లాంచ్ చేసింది. ఐఫోన్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, మీరు దీన్ని ఒకసారి తప్పక చెక్ చేయండి. ఐస్టోర్ ఇండియా అందించే ఐఫోన్ ఎస్ఈ 3పై అన్ని డీల్‌లు, డిస్కౌంట్లను ఇప్పుడు తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
ఐస్టోర్ ఇండియా ఐఫోన్ ఎస్ఈ 3పై ఆఫర్లు
యాపిల్ ఇండియా స్టోర్ నిర్దిష్ట నిబంధనలు, షరతులతో ఐఫోన్ ఎస్ఈ 3ని కేవలం రూ.28,900కే అందిస్తోంది. ఈ స్టోర్ ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకుల క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లపై రూ.2000 క్యాష్‌బ్యాక్ వ్యాల్యూని ఆఫర్ చేస్తోంది. అలానే ఇది ఐఫోన్ 8 64 జీబీని ఎక్స్ఛేంజ్ చేసుకోవాలనుకునే వారికి రూ.13,000 ఎక్స్ఛేంజ్ వాల్యూని ఆఫర్ చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ ఆఫర్లు, డిస్కౌంట్లు అన్ని కలిపిన తర్వాత, ఐఫోన్ ఎస్ఈ 3 ధర రూ.28,900కే లభిస్తుంది. ఈ డీల్ ఐఫోన్ ఎస్ఈ 3 128జీబీ, 256జీబీ వేరియంట్లకు కూడా వర్తిస్తుంది. ఐస్టోర్ లో ఐఫోన్ ఎస్ఈ 3 మాత్రమే కాకుండా ఐఫోన్ 13, ఐఫోన్ 12 కూడా తగ్గింపు ధరలో అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 13 128జీబీ కేవలం రూ.51,900 ధరకే అందుబాటులోకి రాగా ఐఫోన్ 12 రూ.38,900కే లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఐఫోన్ ఎస్ఈ 3 స్పెసిఫికేషన్లు
ఐఫోన్ ఎస్ఈ 2020 మాదిరిగానే 4.7 అంగుళాల డిస్ప్లేతో ఐఫోన్ ఎస్ఈ 3 కాంపాక్ట్ లుక్ ని క్యారీ చేసింది. ఇందులో అప్‌గ్రేడెడ్ ప్రాసెసర్ బయోనిక్ A15 చిప్ సెట్, మరిన్ని అదిరిపోయే ఫీచర్లను అందించారు. f/1.8 ఎపర్చరుతో 12-మెగాపిక్సెల్ వైడ్ కెమెరాను దీనిలో ఆఫర్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)