ఫ్లిప్‌కార్ట్ సెకండ్ హ్యాండ్ మొబైల్, సెకండ్ హ్యాండ్ ఐఫోన్, సెకండ్ హ్యాండ్ ఐఫోన్, సెకండ్ హ్యాండ్ యాపిల్ ఫోన్, సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్" width="1200" height="800" /> 1. యాపిల్ ఈ వర్షన్ తీసుకొచ్చి వారం రోజులు గడుస్తున్న నేపథ్యంలో యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది తాజాగా ఐఓఎస్ 15.4 సైనింగ్ (iOS Signing) ఆపేసింది. దీనర్థం ఏమిటంటే, యూజర్లు తమ ఐఫోన్ (iPhone)ను ఐఓఎస్ 15.4.1కి అప్‌గ్రేడ్ చేసిన తర్వాత, వారు తిరిగి ఐఓఎస్ 15.4కి డౌన్‌గ్రేడ్ చేయలేరు. ఇది కొందరు యూజర్లకు ప్రాబ్లమ్ అవ్వచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
ఐఫోన్ 7, పిక్సెల్ 3 ఎక్స్ఎల్" width="1600" height="1600" /> 3. ఐఓఎస్ 15.4.1 అప్డేట్ అనేది బగ్ ఫిక్సెస్, ఇంప్రూమెంట్స్ పై ఎక్కువ దృష్టి పెట్టింది. కానీ ఇది ఎలాంటి కొత్త ఫీచర్లను తీసుకురాలేదు. ఐఓఎస్ 15.4, ఐప్యాడ్ ఓఎస్ 15.4కి అప్డేట్ చేసిన తర్వాత యూజర్లు ఎదుర్కొంటున్న బ్యాటరీ డ్రెయిన్ సమస్యను కంపెనీ ఫిక్స్ చేసినట్లు ఐఓఎస్ 15.4.1 అప్డేట్ చేంజ్లాగ్ పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. నావిగేట్ చేస్తున్నప్పుడు లేదా అలర్ట్ ను డిస్ప్లే చేస్తున్నప్పుడు బ్రెయిలీ డివైజెస్ల అన్రెస్పాన్సివ్ సమస్యను ఫిక్స్ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఐఓఎస్ 15.4 అప్డేట్ చేశాక కొన్ని థర్డ్-పార్టీ యాప్‌లలో ‘మేడ్ ఫర్ ఐఫోన్/ ఐప్యాడ్’ హియరింగ్ డివైజ్ లు కనెక్షన్‌ని కోల్పోయాయి. ఐతే ఈ సమస్యకు కూడా ఐఓఎస్ 15.4.1 అప్డేట్తో చెక్ పెట్టింది కంపెనీ. (ప్రతీకాత్మక చిత్రం)
5. సాధారణంగా యూజర్లు సాఫ్ట్వేర్ కొత్త వెర్షన్లతో వచ్చే బగ్‌లను నివారించడానికి ఐఓఎస్ ఓల్డ్ వెర్షన్లకు డౌన్‌గ్రేడ్ చేసుకుంటారు. తమ ఐఫోన్లను జైల్బ్రేక్ చేసే వ్యక్తులు కూడా దీనిని ఉపయోగిస్తారు. అయితే, ఇప్పుడు యూజర్లు ఐఓఎస్ 15.4.1 అప్డేట్ చేసిన తర్వాత ఏదైనా సమస్యలు ఎదుర్కొంటుంటే, ఐఓఎస్ 15.4కి తిరిగి వెళ్లడం సాధ్యం కాదు. (ప్రతీకాత్మక చిత్రం)