ఫ్లాగ్షిప్ యాపిల్ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 6న ముగిసే యాపిల్ డేస్(Apple Days) సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 తర్వాత ఐఫోన్ 14 ప్రో(iPhone 14 Pro), ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్(iPhone 14 Pro Max), ఐఫోన్ 14 ప్లస్(iPhone 14 Plus) వేరియంట్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఐపోన్ 14పై అందిస్తున్న ఆఫర్ పూర్తి వివరాలు ఇవే.. (image: Apple India)
* ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్
స్టాండర్డ్ ఐఫోన్ 14 సిరీస్ దాని ముందున్న ఐఫోన్ 13(iPhone 13)తో దాదాపు సమానంగా ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా సేల్స్ నెమ్మదించాయి. డిజైన్‌లో కూడా ఐఫోన్ 13, ఐఫోన్ 14 ఒకేలా కనిపించడంతో.. లేటెస్ట్ ఐఫోన్ 14ను కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపలేదు. (image: Apple India)
వాస్తవానికి సెట్టింగ్‌లను పరిశీలించకుండా ఈ రెండు ఫోన్ల మధ్య తేడాను గుర్తించడం కష్టం. ఐఫోన్ 14 కంపెనీ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ అయినప్పటికీ, ఇది ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ నుంచి కొత్త యాపిల్ ఐఫోన్ 14ని కేవలం రూ.51,900తో కొనుగోలు చేయవచ్చు. (image: Apple India)
* బెస్ట్ ప్రైస్‌కి ఐఫోన్ 14
యాపిల్ ఐఫోన్ 14, 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ రూ.79,900 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 14, రూ.2,500 ఆఫర్ తర్వాత రూ.77,400కి లిస్ట్ అయింది. దానితో పాటు కొనుగోలుదారులు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ నాన్-EMI, క్రెడిట్, డెబిట్ కార్డ్ EMI ట్రాన్సాక్షన్లపై రూ.5,000 ఇన్స్టాంట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీనితో ఐఫోన్ 14 ధర రూ.72,400కి తగ్గుతుంది. (image: Apple India)
* ఐఫోన్ 14 స్పెసిఫికేషన్స్
యాపిల్ ఐఫోన్ 14 స్మార్ట్‌ఫోన్ 6.1-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. సూపర్ రెటినా XDR OLED స్క్రీన్లు, 1200 నిట్స్ పీక్ HDR బ్రైట్నెస్, డాల్బీ విజన్ ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ A15 బయోనిక్ చిప్సెట్, iOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. అదే విధంగా 12MP ప్రైమరీ లెన్స్ అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
లో లైట్ పెర్ఫార్మెన్స్ కోసం f/1.9 అపర్చర్‌తో కొత్త 12MP ఫ్రంట్ ట్రూడెప్త్ కెమెరా ఉంటుంది. యాపిల్ కొత్త యాక్షన్ మోడ్, వీడియో క్యాప్చర్ చేసినప్పుడు షేక్స్, మోషన్, వైబ్రేషన్లను అడ్జస్ట్ చేస్తుంది. అదనంగా ఈ స్మార్ట్ఫోన్లు సినిమాటిక్ మోడ్‌ను అందిస్తున్నాయి. ఇది 30 fps, 24 fps వద్ద 4K క్యాప్చర్ చేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో 5G సపోర్ట్, Wi-Fi 6, బ్లూటూత్ 5.3, రీడర్ మోడ్‌తో NFC వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.