1. గతేడాది ఐఫోన్ 14 సిరీస్‌లో ఐఫోన్ 14 (iPhone 14), ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మోడల్స్ రిలీజయ్యాయి. వీటిలో ఐఫోన్ 14 తొలిసారి భారీ తగ్గింపు ధరతో లభిస్తోంది. రిలీజ్ ధరతో పోలిస్తే ఏకంగా రూ.10,000 తగ్గింపుతో ఐఫోన్ 14 లభిస్తోంది. ఈ డిస్కౌంట్ ధర ఫ్లిప్‌కార్ట్‌లోనే లభిస్తోంది. (image: Apple India)
2. ఐఫోన్ 14 మూడు వేరియంట్లలో లభిస్తుంది. రిలీజ్ ధరలు చూస్తే 128జీబీ వేరియంట్ ధర రూ.79,900 కాగా, 256జీబీ వేరియంట్ ధర రూ.89,900. ఇక హైఎండ్ మోడల్ 512జీబీ వేరియంట్ ధర రూ.1,09,900. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ధరలు చూస్తే 128జీబీ వేరియంట్ ధర రూ.69,999 కాగా, 256జీబీ వేరియంట్ ధర రూ.81,999. ఇక హైఎండ్ మోడల్ 512జీబీ వేరియంట్ ధర రూ.1,01,999. (image: Apple India)
3. ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలతో కొంటే రూ.4,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. నోకాస్ట్ ఈఎంఐ రూ.11,667 నుంచి ప్రారంభం అవుతుంది. (image: Apple India)