ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ (Apple) నుంచి రిలీజ్ అయ్యే ఐఫోన్స్ (iPhones) ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ప్రియులను ఆకర్షిస్తుంటాయి. ఈ ఫోన్ల ధర చాలా అధికంగా ఉన్నప్పటికీ హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. 2021, సెప్టెంబర్‌లో విడుదలైన ఐఫోన్ 13 (iPhone)ని కూడా ప్రజలు విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. 2022 మొదటి త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడుపోయిన స్మార్ట్‌ఫోన్‌గా ఐఫోన్ 13 నిలిచిందంటే ఈ ఫోన్ ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.(ప్రతీకాత్మక చిత్రం)
అయితే ఐఫోన్ 13ని సొంతం చేసుకోవాలనుకునే కోరిక చాలా మందిలో ఉన్నా ధర ఎక్కువగా ఉండటం వల్ల కొనుగోలు చేయలేకపోతున్నారు. వారిలో మీరు కూడా ఒకరైతే, ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) మీకు ఒక గుడ్‌న్యూస్ చెప్పింది. ఒక షరతుకు లోబడి ఉంటే అమెజాన్ మీకు ఐఫోన్ 10పై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తుంది. ఆ షరతు ఏంటి, ఐఫోన్‌పై తీసుకొచ్చిన డిస్కౌంట్ ఎంత వంటి వివరాలు తెలుసుకుందాం.
అమెజాన్ యూకేలో ఐఫోన్ 13 ధర తగ్గింపు
ఐఫోన్ 13 అసలు ధర 789 పౌండ్ స్టెర్లింగ్స్ (దాదాపు రూ.76,487). ఈ ధర చాలా మందికి తమ స్తోమతకు మించినదిగా అనిపించవచ్చు. అయితే అమెజాన్ యూకే (Amazon UK) భారీ ధర తగ్గింపుతో ఐఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. 789 పౌండ్స్‌లో 50 పౌండ్స్ (సుమారు రూ.4,850) తగ్గించింది. అంటే మీరు ఐఫోన్ 13 (iPhone 13) 128జీబీ వేరియంట్‌ను 739 పౌండ్ స్టెర్లింగ్స్ (సుమారు రూ.71,600)కి దక్కించుకోవచ్చు.
ఇంత మొత్తంలో ఒకేసారి డబ్బులు చెల్లించే స్థోమత లేకపోతే అమెజాన్ మీకోసం ఈఎంఐ లేదా నెలవారీ వాయిదాల్లో చెల్లించే సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. కొనుగోలుదారులు ఈఎంఐ పద్ధతిలో ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్ కోసం 12 నెలల పాటు 60.75 పౌండ్ స్టెర్లింగ్స్ (దాదాపు రూ.5,890) చెల్లించవచ్చు. ఈ ఐఫోన్ 13 ధర తగ్గింపుతో మొబైల్ ఫోన్ చౌకగా మాత్రమే కాకుండా మరింత సరసమైనదిగా లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఒకవేళ మీకు ఎక్కువ స్టోరేజీ కావాలనుకుంటే 256జీబీ, 512జీబీ వేరియంట్లపై కూడా ఇలాంటి డిస్కౌంట్స్ పొందవచ్చు. ఈ వేరియంట్లపై 50 పౌండ్స్ (సుమారు రూ.4,850) డిస్కౌంట్, 12 నెలల ఈఎంఐ పొందొచ్చు. 256జీబీ వేరియంట్‌ను నెలకు 829 పౌండ్స్ లేదా 69.09 పౌండ్ల ఈఎంఐతో సొంతం చేసుకోవచ్చు. 512జీబీ వేరియంట్‌ను నెలకు 1,029 పౌండ్స్ లేదా 85.75 పౌండ్ల ఈఎంఐతో కొనుగోలు చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
ఐఫోన్ 13 స్పెసిఫికేషన్లు
ఐఫోన్ 13 (iPhone) స్మార్ట్‌ఫోన్‌లో 60HZ రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా డిస్ప్లే, యాపిల్ A15 బయోనిక్ చిప్సెట్, యాపిల్ జీపీయూ, 12ఎంపీ ప్రైమరీ లెన్స్, 12ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, రెటీనా ఫ్లాష్‌తో 12ఎంపీ సెల్ఫీ కెమెరా అందించారు. అమెజాన్ డీల్‌లో గ్రీన్ కలర్‌తో సహా అన్ని కలర్స్ అందుబాటులో ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)