ప్రముఖ టెలికమ్యూనికేషన్ కంపెనీ ఏటీ&టీ (AT&T) యాపిల్ ఐఫోన్ 13 లైనప్‌లో అతి చిన్న స్మార్ట్‌ఫోన్ అయిన ఐఫోన్ 13 మినీని పూర్తిగా ఉచితంగా ఆఫర్ చేస్తోంది. అయితే ఈ ఫోన్‌ను పైసా కూడా చెల్లించకుండా దక్కించుకోవాలంటే మీరు దాని ఇన్స్టాల్మెంట్ ప్లాన్‌కి సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ ప్లాన్ ఏంటి, ఆఫర్ షరతులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.(ప్రతీకాత్మక చిత్రం)
ఈ అగ్రిమెంట్ ప్రకారం, ఈ ఆఫర్‌కు అర్హత సాధించడానికి మీరు స్మార్ట్‌ఫోన్‌ను ఇన్స్టాల్మెంట్ ప్లాన్‌లో కొనుగోలు చేయాలి. అలానే మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఓల్డ్ స్మార్ట్‌ఫోన్ మంచి కండిషన్లో ఉండాలి, గీతలు ఉండకూడదు, డ్యామేజ్ అవ్వకూడదు. అలానే బ్యాటరీ పాడుకాకుండా ఉండాలి. డిస్కౌంట్ అనేది మీరు కంపెనీకి ఇచ్చే మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఐఫోన్ 11 లాంటి మోడల్ ఫోన్స్ ఇస్తే మీరు 700 డాలర్ల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
ఆఫర్‌ను పొందేందుకు, మీరు AT&Tతో 36-నెలల ప్లాన్‌కు సైన్ ఇన్ చేయాలి. ఈ ప్లాన్‌ను 36 నెలల పాటు కొనసాగించాలి. ఈ మొత్తం పీరియడ్ లో మీరు ప్లాన్‌కు మనీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీరు ఐఫోన్ మినీ కోసం మీ పేమెంట్ ని వాయిదా వేసుకుంటున్నారని అర్థం. లేదా వాయిదాలలో మీరు ఐఫోన్ 13 మినీ కోసం డబ్బులు చెల్లిస్తారని దీని అర్థం. (ప్రతీకాత్మక చిత్రం)
రియర్ సైడ్ 12ఎంపీ వైడ్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో సహా డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. కాబట్టి, త్వరపడి ఈ ఫోన్ ని ఉచితంగా సొంతం చేసుకోండి. ఏటీ&టీ ఇన్స్టాల్మెంట్ ప్లాన్ ధర, ఐఫోన్ 13 మినీ వేరియంట్ల ఆఫర్ గురించి మరిన్ని వివరాల కోసం మీరు https://www.att.com/buy/phones/apple-iphone-13-mini-128gb-pink.html ఈ లింక్‌ను విజిట్ చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)