ఈ కంపెనీ రూ.53,058 విలువైన ఐఫోన్ 12 (iPhone 12)ను ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది. నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా ఇది నిజం. అయితే ఈ కిల్లర్ డీల్ కేవలం అమెరికా దేశంలో నివసించే వారికే వర్తిస్తుంది. యూఎస్ (US)లో నివసించే ప్రతి ఒక్కరికీ ఈ కళ్లు చెదిరే ఐఫోన్ 12 ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
వెరిజోన్ ఐఫోన్ 12 ధర తగ్గింపు ఆఫర్
అమెరికన్ టెలికాం కంపెనీ వెరిజోన్ అద్భుతమైన ఐఫోన్ 12 ప్రైస్ కట్ ఆఫర్‌తో ప్రజలను ఆకర్షిస్తోంది. ఈ ఆఫర్ లో ఐఫోన్ 12 64జీబీ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ డీల్ కింద, మీరు 699 డాలర్లు ఖరీదైన ఐఫోన్ 12 64జీబీని పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
యాపిల్ A14 బయోనిక్ చిప్ సాయంతో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ 12ఎంపీ ప్రైమరీ షూటర్, 12ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో 12ఎంపీ సెల్ఫీ కెమెరాను అందించారు. ఇందులో ఫేస్ఐడీ, హాప్టిక్ ఫీడ్‌బ్యాక్, సహా చాలా అట్రాక్టివ్ ఫీచర్లు ఉన్నాయి. ఒక వేళ మీరు అమెరికాలో నివసిస్తున్నట్లయితే ఈ కిల్లర్ డీల్ పై ఓ లుక్కేయండి. (ప్రతీకాత్మక చిత్రం)