1. ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా కొత్త ట్యాగింగ్ ఫీచర్‌ను(Tagging Features) అందరికీ పరిచయం చేసింది. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ క్రియేటివ్ పార్ట్నర్స్ను తమ పోస్ట్‌లో లేదా రీల్స్‌లో ఈజీగా ట్యాగ్(Tag) చేసుకోవచ్చు. నిజానికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంతకుముందే కొలాబరేటివ్ పోస్ట్‌లు (Collaborative Posts) పెట్టుకునే సదుపాయం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. కొత్త ఫీచర్ ట్యాగ్ చేసిన యూజర్ ప్రొఫైల్ కేటగిరీ (Tagged User Profile Category)ని కూడా డిస్ప్లే చేస్తుంది. ఇప్పటివరకు ఈ ఎన్హాన్సెడ్ ట్యాగ్స్ (Enhanced Tags) ఫీచర్ బిజినెస్ లేదా ప్రముఖ క్రియేటర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఇది అందరికీ రోల్ అవుట్ అయ్యింది. మరి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్హాన్సెడ్ ట్యాగ్స్ అంటే ఏంటి? ఎన్హాన్సెడ్ ట్యాగ్స్ ఎలా ఉపయోగించాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఎన్హాన్సెడ్ ట్యాగ్స్ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫీడ్ లేదా రీల్స్‌లో కనిపించే పోస్ట్‌లు, షార్ట్ వీడియోలలో యూజర్లు తమ క్రియేటివ్ పార్ట్నర్స్ను లేదా బ్రాండ్స్‌కు క్రెడిట్ ఇవ్వడానికి అనుమతిస్తుంది. "ఈ ఫీచర్ క్రియేటర్ల నేమ్ పబ్లిక్‌గా డిస్ప్లే చేస్తుంది. అలాగే సెల్ఫ్-ఐడెంటిఫైడ్ ప్రొఫైల్ కేటగిరీని డిస్ప్లే చేస్తుంది" అని ఇన్స్టాగ్రామ్ తన పోస్ట్‌లో పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. కేటగిరీలలో మేకప్ ఆర్టిస్ట్, కొరియోగ్రాఫర్ క్రియేటివ్ డైరెక్టర్, ఫొటోగ్రాఫర్, ఇతర కేటగిరీలు, ఫీచర్ ఇమేజ్‌లో స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో పోస్ట్‌లో ట్యాగ్ అయిన పేర్లు ప్రకారం ఎవరు మేకప్ ఆర్టిస్ట్, ఎవరు ఫొటోగ్రాఫర్ అనేది ఇమేజ్ను చూసి యూజర్లు ఈజీగా తెలుసుకోవచ్చు. దీనివల్ల యూజర్లకు ప్రొడక్ట్స్, సర్వీసెస్ మరింత సులభంగా చేరువవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. “క్రియేటివ్ క్రెడిట్, గుర్తింపు అనేది కొత్త అవకాశాలు, ఆర్థిక సాధికారతకు చాలా ముఖ్యం. ఎక్కువ మంది క్రియేటర్లు పరస్పరం సహకరించుకోవడం వల్ల ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది” అని ఇన్స్టాగ్రామ్ ఈ ఫీచర్‌ను రిలీజ్ చేస్తూ పేర్కొంది. స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్‌ను ఓపెన్ చేసి టాప్ రైట్ కార్నర్లో ఉన్న '+' ఐకాన్‌పై క్లిక్ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)