ప్రముఖ ఫొటో, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ (Instagram) సరికొత్త ఫీచర్లతో యూజర్ ఎక్స్పీరియన్స్ మెరుగుపరుస్తోంది. ఇందులో భాగంగా తాజాగా కొలాబరేటివ్ కలెక్షన్స్ (Collaborative Collections) ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్... యూజర్లు ఒక పోస్ట్‌ను ఫ్రెండ్ లేదా ఫ్రెండ్స్ గ్రూప్స్‌తో షేర్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు ఒకరికొకరు కలిసి ప్రత్యేకమైన స్పేస్‌లో ఇమేజ్‌లు సేవ్ చేయవచ్చు.
సింపుల్‌గా చెప్పాలంటే ఈ 'కొలాబరేటివ్ కలెక్షన్స్' స్నేహితులతో ఒక షేర్డ్ కలెక్షన్స్‌గా ఉంటుంది. స్నేహితులతో పాటు మీకు కూడా ఒకే అంశంపై ఆసక్తి ఉంటే దానికి సంబంధించిన పోస్టులను ఒకరికొకరు షేర్ చేసుకోవడానికి, అలాగే వాటిని చూసుకోవడానికి కొత్త ఫీచర్ తోడ్పడుతుందని ఒకటి రిపోర్ట్ తెలిపింది. దీని పనితీరుకు సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం.
ప్రత్యేకంగా మెసేజ్ చేయాల్సిన అవసరం లేదు : సాధారణంగా ఇన్స్టాగ్రామ్ వాడుతున్నప్పుడు మీతో పాటు మీ ఫ్రెండ్స్‌కి నచ్చే పోస్టులు కనిపిస్తుంటాయి. అప్పుడు వాటిని వారితో షేర్ చేయాలనిపిస్తుంది. ఐతే ఇంతకు ముందు వారితో పోస్టులు షేర్ చేయడానికి పోస్ట్ యూఆర్ఎల్ లింక్ కాపీ చేసి వారికి సెపరేట్‌గా మెసేజ్ చేయాల్సి వచ్చేది. దాని సేవ్ చేసుకున్నా అది మీ వరకు మాత్రమే కనిపించేది.
ఈ కలెక్షన్లకు నచ్చిన పేరుని ఇవ్వవచ్చని, కలెక్షన్లలో చేరడానికి మీ స్నేహితులను ఆహ్వానించవచ్చని మొస్సేరి వివరించారు. వారు చేరిన తర్వాత, వారు తమ ఫీడ్, డైరెక్ట్ మెసేజ్‌లు, రీల్స్ నుంచి పోస్ట్‌లను జోడించవచ్చు లేదా కలెక్షన్‌ను చెక్ చేయవచ్చని వెల్లడించారు. ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహితులు కలిసి కంటెంట్‌ను సేవ్ చేయడం, షేర్ చేయడం సులభం చేస్తుందని చెప్పారు.