1. కొత్త సెక్యూరిటీ ఫీచర్ ప్రకారం, ఇకపై ఇన్స్టాగ్రామ్ కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆ యూజర్ తన సెల్ఫీ వీడియో సబ్మిట్ చేయాల్సిందే!. ఈ ఫీచర్‌ను గతేడాది నుంచే పరీక్షిస్తున్నట్లుగా సమాచారం. కొంత మంది వ్యక్తులు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకే పేరుతో మల్టిపుల్ ఖాతాలు సృష్టించి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఇన్స్టాగ్రామ్ గుర్తించింది. దీంతో, ఆయా యూజర్లకు చెక్ పెట్టేందుకు ఇన్స్టాగ్రామ్ ఈ ఫీచర్‌పై పనిచేస్తోంది. మల్టిపుల్ ఖాతాలను క్రియే చేసే వారి ఆట కట్టించేందుకు దీన్ని సిద్ధం చేస్తోంది.
3. ఇన్స్టాగ్రామ్ తాజాగా రీల్స్‌లో మ్యూజిక్ ఎడిట్ చేయడానికి వీలుగా మూడు కొత్త ఎఫెక్ట్స్ లాంచ్ చేసింది. వీటిని సూపర్ బీట్, డైనమిక్ లిరిక్స్, 3డీ లిరిక్స్ గా ఇన్స్టాగ్రామ్ (Instagram) పేర్కొంది. ఈ ఎఫెక్ట్స్ రీల్ మ్యూజిక్ ఆధారంగా స్క్రీన్ పై లిరిక్స్ అందించడం.. అలాగే ఆటోమేటిక్‌గా ఎడిట్ చేయడంలో సహాయపడతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. సూపర్ బీట్, డైనమిక్ లిరిక్స్, 3డీ లిరిక్స్ అనే మూడు కొత్త ఎఫెక్ట్స్ యూజర్లకు రీల్స్‌లో మ్యూజిక్, ఏఆర్ ఎఫెక్ట్స్ సులువైన మార్గాలను అందిస్తాయి. సూపర్ బీట్ అనేది ఒక కొత్త మ్యూజిక్ బీట్ ఎఫెక్ట్. ఇది యూజర్ ఎంచుకున్న పాట ఆధారంగా వారి రీల్‌కు ఆకర్షణీయమైన విజువల్ ఎడిట్లను ఆటోమేటిక్‌గా అప్లై చేస్తుంది. డైనమిక్ & 3డీ లిరిక్స్ రెండు కొత్త లిరిక్ ఎఫెక్ట్లు. ఇవి రీల్‌కు పాటల లిరిక్స్‌ను అందిస్తాయి. తద్వారా యూజర్ మ్యూజిక్‌కి పర్ఫార్మ్ చేయగలరు.
(ప్రతీకాత్మక చిత్రం)
5. ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీ ఉన్న వారికి తెలుసు 10,000 లేదా అంతకంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తులు మాత్రమే పలు లింక్‌లను, కంటెంట్‌ను స్టోరీస్ (Strories)ను షేర్ చేయగలరని.. కానీ ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు పదవేల కంటే తక్కువ ఉన్న వారికి కూడా పలు కొత్త ఫీచర్ల (New Features)ను అందిస్తోంది. దీని ద్వారా యూజర్ల పేజ్ రీచ్ పెరుగుతందని ఇన్‌స్టా చెబుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. నాన్- ఇన్ఫ్లుయెన్సర్లు కొన్ని సింపుల్ స్టెప్స్ (Simple Steps) తో ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో లింక్‌లను సులభంగా యాడ్ చేయవచ్చు. మీరు ఒక్కో స్టోరీలో ఒక లింక్‌ను మాత్రమే షేర్ చేయగలరనే విషయం మర్చిపోవద్దు. స్టిక్కర్లను స్టోరీ పోస్ట్‌లలో మాత్రమే ఉపయోగించాలి. కానీ ఫీడ్ పోస్ట్‌లలో ఉపయోగించలేరు. (ప్రతీకాత్మక చిత్రం)
7. మీ ఆండ్రాయిడ్ (Android), ఐఓఎస్ (IOS)ఫోన్లలో ఇన్స్టాగ్రామ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ లైట్ (Insta Lite) యాప్ లో ఈ ఫీచర్ అందుబాటులో లేదు. యాప్ హోమ్‌పేజీ (లేదా న్యూస్ ఫీడ్)లో, ఇన్స్టాగ్రామ్ కెమెరాను ఓపెన్ చేయడానికి రైట్ సైడ్ కి స్వైప్ చేయండి. ఇప్పుడు మీరు ఒక ఫోటో తీసుకోండి. లేదా డివైజ్‌లో అందుబాటులో ఉన్న పిక్చర్ సెలక్ట్ చేసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
8. నెక్స్ట్ స్క్రీన్ (Next Screen)లో మీకు టెక్స్ట్, ఎఫెక్ట్స్, డ్రాయింగ్, స్టిక్కర్స్ యాడ్ చేసుకోవడం వంటి అప్షన్స్ కనిపిస్తాయి. లింక్ స్టిక్కర్‌ను యాడ్ చేయాల్సిన అవసరం ఉన్నందున, స్టిక్కర్ల ప్యానెల్‌ను తెరవడానికి పైకి స్వైప్ చేయండి. ప్రత్యామ్నాయంగా టాప్ వరుసలో ఉన్న స్టిక్కర్ ఐకాన్‌పై కూడా మీరు క్లిక్ చేయవచ్చు. స్టిక్కర్ ప్యానెల్ (Stiker Pannel) ఓపెన్ అయిన తర్వాత.. సెర్చ్ బార్‌ను ట్యాప్ చేసి దానిలో లింక్ అని టైప్ చేయండి. స్టిక్కర్ల సెక్షన్ కింద లింక్ గుర్తు ఉన్న లింక్ స్టిక్కర్‌ను ఎంచుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
9. తదుపరి స్క్రీన్ స్టిక్కర్‌కు లింక్‌ను యాడ్ చేయమని అడుగుతుంది. వెబ్ అడ్రస్‌ను ఇక్కడ నమోదు చేయండి. ఒకవేళ మీరు లింక్‌ను కాపీ చేసినట్లయితే అక్కడ పేస్ట్ చేయవచ్చు. ఇప్పుడు టాప్ లో రైట్ సైడ్ లో ఉన్న డన్ బటన్ ను నొక్కండి. ఇప్పుడు మీరు స్టోరీ అప్షన్ (Story Option) స్క్రీన్‌పైకి తిరిగి వస్తారు. లింక్ స్టిక్కర్‌ను మీకు కావలసిన పొజిషన్ లో సెట్ చేసుకోండి. స్టిక్కర్‌పై నొక్కడం ద్వారా స్టిక్కర్ వివిధ థీమ్‌ల మధ్య మారేలా చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)