Earth’s inner core : భూమి మధ్యలో ఉన్న పదార్థాన్ని అవుటర్ కోర్, ఇన్నర్ కోర్ అని అంటారు. ఇందులో ఇన్నర్ కోర్ పూర్తిగా సలసలగా కాగే ఐరన్‌తో కూడిన బంతిలా ఉంటుందని అంచనా. ఇది ప్లూటో అంత ఉంటుందనీ.. ఇది భూమిలా తిరగడం మానేసిందనే అంచనా ఉంది. ఇంకా చెప్పాలంటే.. ఇది రివర్సులో తిరుగుతుందనే అంచనా ఉంది. ఎందుకో తెలుసుకుందాం.
భూకంపాలు వచ్చినప్పుడు వచ్చే సిస్మిక్ తరంగాలను ఆధారంగా చేసుకొని శాస్త్రవేత్తలు అంచనాలకు వస్తున్నారు. రివర్సులో ఎలా, ఎందుకు తిరుగుతుంది అనే ప్రశ్న రావచ్చు. వాళ్లు ఏమంటున్నారంటే.. ఈ ఇన్నర్ కోర్ అనేది.. ద్రవరూపంలో ఉన్న ఔటర్ కోర్లో తేలుతూ ఉందని.. అందువల్లే దాని తిరుగుడు లెక్క వేరుగా ఉండగలుగుతోందని అంటున్నారు.