ప్రముఖ టెక్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ (Infinix), హై క్వాలిటీ స్మార్ట్ఫోన్లను తక్కువ ధరలకే లాంచ్ చేస్తుంటుంది. ఈ కంపెనీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అద్భుతమైన డిజైన్లతో ఫోన్లను తయారు చేస్తుంది. ఇటీవలే ఈ సంస్థ 260W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌ను ఆవిష్కరించింది. ఇప్పటివరకు ఏ మొబైల్ కంపెనీ కూడా ఇంత ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్‌ను రిలీజ్ చేయలేదు.
కంపెనీ కొద్ది రోజుల క్రితం 260W ఛార్జింగ్ అడాప్టర్‌తో 4400mAh బ్యాటరీని ఉపయోగించి తన ఛార్జింగ్ టెక్ని ప్రదర్శించింది. ఆ ఛార్జింగ్ టెక్‌తో 4400mAh బ్యాటరీ 8 నిమిషాల్లో 100 శాతం ఛార్జ్ అయ్యింది. అంటే అప్‌కమింగ్ GT 10 ప్రో మొబైల్‌ని ఫుల్ ఛార్జ్ చేయడానికి కేవలం పది నిమిషాల సమయం పడుతుందని చెప్పవచ్చు.