1. హాంకాంగ్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇన్ఫీనిక్స్ ఇండియాలో మరో రెండు స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఇన్ఫీనిక్స్ నోట్ 12 సిరీస్‌లో (Infinix Note 12 Series) రెండు మోడల్స్ తీసుకొచ్చింది. ఇన్పీనిక్స్ నోట్ 12 5జీ, ఇన్పీనిక్స్ నోట్ 12 ప్రో 5జీ (Infinix Note 12 Pro 5G) మోడల్స్ రిలీజ్ చేసింది. గతంలో ఇన్ఫీనిక్స్ జీరో 5జీ మొబైల్ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. (image: Infinix India)
2. ఇప్పుడు మరో రెండు 5జీ స్మార్ట్ఫోన్లను పరిచయం చేసింది. ఇందులో 12 5జీ బ్యాండ్స్ సపోర్ట్, మొలెడ్ డిస్ప్లే, 108ఎంపీ కెమెరా సపోర్ట్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. రూ.15,000 లోపు, రూ.20,000 లోపు బడ్జెట్లో రెండు మొబైల్స్ వచ్చాయి. ఇప్పటికే ఈ సెగ్మెంట్లో ఉన్న 5జీ స్మార్ట్ఫోన్లకు ఇన్పీనిక్స్ నోట్ 12 5జీ, ఇన్పీనిక్స్ నోట్ 12 ప్రో 5జీ పోటీ ఇవ్వనున్నాయి. (image: Infinix India)
3. ఇన్పీనిక్స్ నోట్ 12 5జీ స్మార్ట్‌ఫోన్ విశేషాలు చూస్తే స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్లో రిలీజైంది. ధర రూ.14,999. ఇక ఇన్పీనిక్స్ నోట్ 12 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్లో రిలీజైంది. ధర రూ.17,999. ఫ్లిప్‌కార్ట్‌లో జూలై 15న సేల్ ప్రారంభం కానుంది. (image: Infinix India)
4. ఇన్పీనిక్స్ నోట్ 12 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఫోర్స్ బ్లాక్, స్నోఫాల్ వైట్ కలర్స్‌లో కొనొచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డుతో కొంటే రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. ఇన్పీనిక్స్ నోట్ 12 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.12,499 ధరకు, ఇన్పీనిక్స్ నోట్ 12 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.15,499 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: Infinix India)
5. ఇన్పీనిక్స్ నోట్ 12 5జీ, ఇన్పీనిక్స్ నోట్ 12 ప్రో 5జీ స్మార్ట్ఫోన్లలో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియల్మీ నార్జో 50, రియల్మీ 9, రియల్మీ 8ఎస్, వివో వీ23ఈ మోడల్స్‌లో ఇదే ప్రాసెసర్ ఉంది. ఆండ్రాయిడ్ 12 + XOS 10.6 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: Infinix India)
6. ఇన్పీనిక్స్ నోట్ 12 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 108మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + ఏఐ లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇన్పీనిక్స్ నోట్ 12 5జీ మోడల్లో 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + ఏఐ లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. రెండు మోడల్స్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం డ్యూయెల్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో 16 మెగాపిక్సెల్ ఏఐ సెల్ఫీ కెమెరా ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. (image: Infinix India)