1. హాంగ్‌కాంగ్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫీనిక్స్ ఇండియాలో ఇటీవల ఇన్ఫీనిక్స్ నోట్ 11 (Infinix Note 11), ఇన్ఫీనిక్స్ నోట్ 11ఎస్ (Infinix Note 11S) మోడల్స్‌ని లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో రిలీజ్ చేసిన ఇన్ఫీనిక్స్ నోట్ 10 సిరీస్‌ను అప్‌గ్రేడ్ చేసి ఇన్ఫీనిక్స్ నోట్ 11, ఇన్ఫీనిక్స్ నోట్ 11ఎస్ మోడల్స్‌ని రిలీజ్ చేసింది కంపెనీ. (image: Infinix India)
2. రూ.12,000 లోపు ఇన్ఫీనిక్స్ నోట్ 11, రూ.15,000 లోపు బడ్జెట్లో ఇన్ఫీనిక్స్ నోట్ 11ఎస్ మోడల్స్‌ను రిలీజ్ చేసింది. వీటిలో ఇన్ఫీనిక్స్ నోట్ 11ఎస్ సేల్ ప్రారంభమైంది. ఇవాళ ఇన్ఫీనిక్స్ నోట్ 11 సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో మొదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇంట్రడక్టరీ ధర రూ.11,999 మాత్రమే. ఈ ధర కొన్ని రోజుల తర్వాత పెరగొచ్చు. (image: Infinix India)
3. ఇన్ఫీనిక్స్ నోట్ 11 స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే రిలీజ్ అయింది. ధర రూ.11,999. ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. గ్రాఫైట్ బ్లాక్, సెలెస్టియల్ స్నో, గ్లేసియర్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది. ఇప్పటికే ఈ బడ్జెట్లో రియల్మీ నార్జో 30, రియల్మీ 8ఐ, పోకో ఎం3 ప్రో 5జీ, రియల్మీ 8, మోటో జీ31 లాంటి మోడల్స్ ఉన్నాయి. (image: Infinix India)
4. ఇన్ఫీనిక్స్ నోట్ 11 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే ఉంది. డిస్ప్లేలో ఐకేర్ మోడ్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గేమ్ బూస్ట్ టెక్నాలజీ DAR-LINK 2.0 ఫీచర్ ఉండటం విశేషం. (image: Infinix India)
5. ఇన్ఫీనిక్స్ నోట్ 11 స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + ఏఐ లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. మెరాలో ఆటో సీన్ డిటెక్షన్, సూపర్ నైట్, కస్టమ్ పోర్ట్రైట్, ఏఐ హెచ్డీఆర్, ఏఐ త్రీడీ బ్యూటీ, పనోరమా, డాక్యుమెంట్, ఏఆర్ షాట్స్, ప్రోమోడ్, స్లోమో వీడియో, టైమ్ ల్యాప్స్, షార్ట్ వీడియో లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Infinix India)
6. ఇన్ఫీనిక్స్ నోట్ 11 స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. సెల్ఫీ కెమెరాలో సూపర్ నైట్, ఏఐ పోర్ట్రైట్, ఏఐ త్రీడీ ఫేస్ బ్యూటీ, వైడ్ సెల్ఫీ, ఏఆర్ షాట్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. రియర్ కెమెరా, సెల్ఫీ కెమెరాతో 2కే వీడియో రికార్డ్ చేయొచ్చు. బొకే ఫీచర్ కూడా ఉంది. (image: Infinix India)
7. ఇన్ఫీనిక్స్ నోట్ 11 స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 0 నుంచి 100 శాతానికి 1 గంట 34 నిమిషాల్లో చార్జింగ్ అవుతుంది. ఆండ్రాయిడ్ 11 + ఇన్ఫీనిక్స్ XOS10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డీటీఎస్ సరౌండ్ సౌండ్ ఫీచర్‌తో డ్యూయెల్ స్టీరియో స్పీకర్స్ ఉండటం విశేషం. (image: Infinix India)