ఎప్పుడో 2008లో చందమామ చెంతకు ఇస్రో... చంద్రయాన్-1 ఉపగ్రహాన్ని పంపింది. చందమామపై నీరు గడ్డకట్టి ఉందని ఆ శాటిలైట్ ప్రపంచానికి చెప్పింది. మళ్లీ పదేళ్ల తర్వాత... ఈ ఏడాది జులైలో చందమామ చెంతకు చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని పంపబోతోంది ఇస్రో. (Image : ISRO/Twitter)
చంద్రయాన్-1 కంటే... చంద్రయాన్-2 చాలా శక్తిమంతమైన, అధునాతనమైన, అప్‌గ్రేడెడ్ శాటిలైట్. ఇది ఇండియాకు చెందిన 14 పేలోడ్స్‌ని తనతో తీసుకెళ్లనుంది. 3,800 కేజీల బరువు ఉండే ఆ శాటిలైట్... చంద్రుడికి 100 కిలోమీటర్ల దగ్గరి దాకా వెళ్లి... చుట్టూ గిరగిరా తిరుగుతుంది. తద్వారా చందమామకు సంబంధించిన మరిన్ని విశేషాల్ని, ఆసక్తికరమైన ఫొటోలనీ భూమికి పంపబోతోంది. (Image : ISRO/Twitter)
భవిష్టత్తులో చందమామపై జీవించే అవకాశాల్ని పరిశీలిస్తున్న ఇస్రో... చంద్రయాన్-2పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చెయ్యాలని ఇస్రో సైంటిస్టులు పదేళ్లుగా కష్టపడుతున్నారు. అందుకు ఫలితం జులైలో కనిపించనుంది. (Image : Hani/Twitter)
విక్రమ్ ల్యాండర్ : ఇప్పటివరకూ ఇస్రో శాటిలైట్లు చందమామను టచ్ చెయ్యలేదు. ఆ చరిత్రను సృష్టించేందుకు ఇస్రో... ఈ ఏడాది సెప్టెంబర్ 6న విక్రమ్ ల్యాండర్‌ను చందమామపైకి పంపబోతోంది. దాంతోపాటూ... ప్రజ్ఞాన్ రోబో రోవర్ కూడా చంద్రుడిపై దిగబోతోంది. (Image : Anatoly-Zak/Twitter)
చందమామ దక్షిణ ధ్రువం (Moon South Polar)లో విక్రమ్ ల్యాండర్‌ను దింపాలని ఇస్రో శాస్త్రవేత్తలు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా దక్షిణ ధ్రువంలో ఎక్కువగా పరిశోధనలు జరగని ప్రదేశంలో ల్యాండ్ చేయాలనుకుంటున్నారు. (Image : HANI/Twitter)
ఈ ప్రాజెక్టును సక్సెస్ చేసి... చందమామ ఉపరితలం ఎలా ఉంది? నీటి శాతం ఎంత? మనుషులు జీవించే అవకాశాలు ఎలా ఉంటాయి అనే అంశాల్ని స్వయంగా తెలుసుకోబోతోంది ఇస్రో. (Image : ISRO/Twitter)
ఎంకే త్రీ హెవీ బూస్టర్ ద్వారా శ్రీహరికోట నుంచి చంద్రయాన్-2 మిషన్‌ను ప్రయోగించబోతున్నారు. (Image : ISRO/Twitter)
2008లో చంద్రయాన్-1 మిషన్‌ను పీఎస్ఎల్వీ బూస్టర్ ద్వారా ప్రయోగించారు. అప్పుడు అది 11 పేలోడ్స్‌ను మోసుకువెళ్లింది. అమెరికాకు చెందిన ఓ పేలోడ్ ద్వారా చంద్రుడిపై నీరు ఉందన్న ఆధారాలు బయటికొచ్చాయి. (Image : ISRO/Twitter)
ఇప్పుడు చంద్రయాన్-2, విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ఎలాంటి శుభవార్తలు తెస్తాయన్నది ఈ ఏడాది చివరికల్లా మనకు తెలుస్తుంది. (Image : GoBarefoot/Twitter)
ఈ విషయంలో మనం ఎంత అభివృద్ధి సాధిస్తే, రోదసీ పరిశోధనల్లో మనం అంతగా దూసుకెళ్లేందుకు అవకాశాలు మెరుగవుతాయి. (Image : ISRO/Twitter)