1. ఐఐటీ హైదరాబాద్ (IIT Hyderabad) సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ సహకారంతో భారతదేశపు మొట్టమొదటి ప్రోటోటైప్ 3డి ప్రింటెడ్ బ్రిడ్జ్‌ను అభివృద్ధి చేసింది. దీన్ని ఐఐటీ హైదరాబాద్ సివిల్ ఇంజనీరింగ్ విభాగ ప్రొఫెసర్ కె.వి.ఎల్. సుబ్రమణ్యం, పరిశోధన బృందం కలిసి రూపకల్పన చేశారు. 3డి కాంక్రీట్ ప్రింటింగ్ సొల్యూషన్స్ అందించడంలో ప్రత్యేకత కలిగిన స్టార్టప్ కంపెనీ సింప్లిఫోర్జ్ ఈ బ్రిడ్జ్ ను ముద్రించింది.
3. సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా ఎక్స్‌ట్రూషన్ మరియు సాఫ్ట్వేర్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. ఇండస్ట్రియల్ రోబోటిక్ ఆర్మ్ 3డి ప్రింటర్ని ఉపయోగించి, సింప్లిఫోర్జ్ ప్రింటింగ్ ఫెసిలిటీలో 2 గంటల వ్యవధిలో బ్రిడ్జ్ ఆఫ్-సైట్ ప్రింట్ చేసి సిద్దిపేటలోని చార్విత మెడోస్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు.
4. బ్రిడ్జ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ వాడకం ఊపందుకొంటుందని చెప్పారు. తక్కువ వ్యవధిలో నిర్మాణాలను పూర్తి చేయగల సామర్థ్యం 3డీ కాంక్రీట్ టెక్నాలజీకి ఉందని తెలిపారు. నిర్మాణ రంగంలో ఈ టెక్నాలజీ అనూహ్య మార్పులు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
5. నిర్మాణరంగంలో వస్తున్న అధునాతన సాంకేతికతకు అనుగుణంగా ఈ త్రీడీ కన్స్ట్రక్షన్ ప్రింటింగ్ టెక్నాలజీ పని చేస్తుంది. ఇందుకు అవసరమైన సాకేంతికతను ఇందులో ఉపయోగించారు. అంతేగాకుండా ఈ సాంకేతికతతో మన అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణాలను డిజైన్ చేసుకోవచ్చు. దీనితో నిర్మించే నిర్మాణాలు ప్రకృతి వైపరిత్యాలను సైతం తట్టుకుని నిలబడేలా ఉండనున్నాయి. దీనికి తోడు ఈ సాంకేతికతను ఉపయోగించడం ద్వారా నిర్మాణాలు చాలా త్వరగా, సులభంగా పూర్తి అవుతాయని అన్నారు.