Photos : వామ్మో.. ఏంది సామీ ఇదీ!.. ఇలాంటి బైకులు కూడా ఉన్నాయా?
Photos : వామ్మో.. ఏంది సామీ ఇదీ!.. ఇలాంటి బైకులు కూడా ఉన్నాయా?
Four-wheeled Electric Bike : ఎలక్ట్రిక్ బైక్స్‌లో అదో రకం. దానికి కారులా 4 చక్రాలుంటాయి. మరి అది ఎలా పనిచేస్తుంది? దాని ఫీచర్స్ ఏంటి? ధర ఎంత? వంటి వివరాలు చూద్దాం. (All Image credit - https://www.alibaba.com)
కొంతమందికి రొటీన్ వెహికిల్ కాకుండా... అత్యంత అరుదైన వాహనం కొనుక్కోవాలనే ఆశ ఉంటుంది. సరిగ్గా అలాంటి వారి కోసమే ఓ ఎలక్ట్రిక్ వెహికిల్ ఉంది. దాని లుక్, డిజైన్, ఫీచర్స్ అన్నీ ప్రత్యేకమే.
2/ 17
చైనా కంపెనీ అలీబాబాలో సేల్‌కి ఉంచిన ఈ ఎలక్ట్రిక్ బైక్‌కి 4 చక్రాలుంటాయి.
3/ 17
హాలీవుడ్ సినిమాల్లోని బ్యాట్‌మేన్ థీమ్‌తో ఈ బైక్‌ని తయారుచేశారు.
4/ 17
దీని ధర 1,250 డాలర్లు (రూ.1,03,666). సాధారణ ఎలక్ట్రిక్ బైక్స్‌తో పోల్చితే.. ఇలాంటి డిజైన్‌తో ఉన్న బైక్‌కి ఈ ధర బెటరే అంటున్నారు కొందరు.
5/ 17
బైక్ అనీ, మల్టీట్రానిక్ అనీ తెలిపారు." width="353" height="323" /> ఇది 1500W హబ్ మోటర్తో దూసుకెళ్తుందని తెలిపారు. ఇది స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైక్ అనీ, మల్టీట్రానిక్ ఎలక్ట్రిక్ బైక్ అనీ తెలిపారు.
6/ 17
దీనికి 60V 20Ah బ్యాటరీ ఉంది. దీని కెపాసిటీ 1.2 kWh మాత్రమే. ఐతే.. సాధారణ ఎలక్ట్రిక్ బైక్స్‌కి ఇంతకంటే బెటర్ బ్యాటరీలు ఉంటున్నాయి.
7/ 17
ఈ బైక్ బరువు 130 కేజీలు. దీని టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు.
8/ 17
ఈ బైక్ అందంగానే ఉన్నప్పటికీ.. ఇది రియల్ బైక్‌లా లేదనీ.. పిల్లలు ఆడుకునే బైక్‌లా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి.
9/ 17
ఈ బైక్ స్టీరింగ్ కూడా మామూలు స్టీరింగ్ కాదు. హబ్ స్టీరింగ్. అంటే దీన్ని నడపడం ఒకింత కష్టమే. జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యకపోతే.. ఎటో వెళ్లిపోగలదు.
10/ 17
యూరప్‌కి చెందిన స్ట్రోల్ వీల్ కంపెనీ దీన్ని తయారుచేసింది. ఈ కంపెనీ చైనాలో తన ఉత్పత్తులను తయారుచేయిస్తోంది. ఈ బైక్‌ని చైనాలోని ఝెజియాంగ్లో OEM బ్రాండ్ పేరుతో చేసినట్లు తెలిపారు. ఈ మోడల్ నంబర్ ST-DQ.
11/ 17
ఈ బైక్ బ్యాటరీని ఫుల్‌గా ఛార్జ్ చెయ్యడానికి 4 నుంచి 6 గంటలు పడుతుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే మాగ్జిమం 60 కిలోమీటర్లు వెళ్తుందని తెలిపారు.
12/ 17
ఈ బైక్‌కి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. ఇది మాగ్జిమం 200 కేజీల బరువును మొయ్యగలదు.
13/ 17
దీనికి ఫ్రంట్, బ్యాక్.. డిస్క్ బ్రేకులున్నాయి. అందువల్ల వేగంగా వెళ్లినా సడెన్ బ్రేక్ వేసినప్పుడు సమస్య ఉండదు అంటున్నారు.
14/ 17
దీనికి ఫ్రంట్, బ్యాక్ మోనో షాక్ సస్పెన్షన్ ఉంది. గతుకుల రోడ్లపై కూడా స్మూత్‌గా వెళ్తుందని అంటున్నారు.
15/ 17
ఈ బైక్ 6 కలర్స్‌లో లభిస్తుంది. అవి గ్రీన్ కేమో, ఎల్లో కామో, స్నో కేమో, మెటల్లిక్, బ్లాక్, బ్లూ.
16/ 17
ప్రస్తుతం ఈ బైక్‌లను 28 దేశాలకు డెలివరీ చేస్తున్నారు. ఇండియా నుంచి కూడా కొనుక్కునే వీలుంది.
17/ 17
ఈ బైక్‌ని ఆర్డర్ చేసిన 7-15 రోజుల్లో డెలివరీ చేస్తామని కంపెనీ తెలిపింది.