Password: అలర్ట్... ఈ 20 పాస్వర్డ్స్ ఉపయోగిస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ
Password: అలర్ట్... ఈ 20 పాస్వర్డ్స్ ఉపయోగిస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ
Worst Passwords List 2020 | మీరు మీ బ్యాంక్ అకౌంట్‌కి ఈజీగా గుర్తుండే పాస్వర్డ్ పెట్టుకున్నారా? ఇమెయిల్‌కు పాత పాస్వర్డ్స్ ఉపయోగిస్తున్నారా? అయితే మీరు రిస్కులో పడ్డట్టే.
బ్యాంక్ అకౌంట్ అయినా, ఇమెయిల్ అయినా పాస్వర్డ్ స్ట్రాంగ్‌గా ఉంటే అకౌంట్‌కు భద్రత ఎక్కువగా ఉంటుంది. కానీ ఉపయోగించిన పాస్‌వర్డ్స్‌నే మళ్లీ మళ్లీ ఉపయోగించడం చాలామందికి అలవాటు.
2/ 25
ఈజీగా గుర్తుంటుంది కదా అని పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, బండి నెంబర్ లాంటి వాటిని పాస్‌వర్డ్స్‌గా పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి పాస్‌వర్డ్స్‌తో రిస్క్ చాలా ఎక్కువ. మీ అకౌంట్‌ని కొల్లగొట్టడం హ్యాకర్లకు పెద్ద కష్టం కాదు.
3/ 25
సులువుగా గుర్తుండే పాస్‌వర్డ్స్‌ని పెట్టుకునేవారినే హ్యాకర్లు ఈజీగా టార్గెట్ చేస్తున్నారని అనేక పరిశోధనలు తేల్చాయి. అందుకే స్ట్రాంగ్ పాస్వర్డ్స్ సెట్ చేసుకోవాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు.
4/ 25
2020 సంవత్సరంలో కామన్‌గా ఉపయోగించి 20 పాస్వర్డ్స్ జాబితా ఇటీవల విడుదలైంది. డార్క్ వెబ్‌లో ఎక్కువగా కనిపించే పాస్‌వర్డ్స్‌తో ఈ జాబితాను రూపొందించి టెక్ నిపుణులు రిలీజ్ చేస్తూ ఉంటారు.
5/ 25
వరస్ట్ 20 లిస్ట్‌లో ఉన్న పాస్వర్డ్స్ అన్నీ చాలా సులువుగా గుర్తుంచుకోగలిగినవే. అందుకే ఇలాంటి పాస్వర్డ్స్ ఉపయోగించొద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మరి మీరు కూడా ఈ కింద వెల్లడించిన 20 పాస్‌వర్డ్స్‌లో ఏ ఒక్క పాస్వర్డ్ ఉపయోగిస్తున్నా వెంటనే మార్చేయండి.