HYUNDAI MOTOR APPLE INC PLAN TO SIGN A PARTNERSHIP DEAL ON AUTONOMOUS ELECTRIC CARS NS
Apple-Hyundai: ఎలక్ట్రిక్ కార్ల తయారీకి కలిసి పని చేయనున్న హ్యుందాయ్, యాపిల్.. తొలి కారు ఎప్పుడంటే..
Apple-Hyundai Electric Car: అగ్ర కంపెనీలు హ్యుందాయ్ మోటార్స్, యాపిల్ ఐఎన్సీ కలిసి పనిచేయనున్నాయి. అటానమస్ విద్యుత్తు కార్ల తయారీ కోసం వీటి కలయిక జరగునుంది. ఇందుకు సంబంధించిన కథనాన్ని కొరియా ఐటీ న్యూస్పేపర్ తాజాగా ప్రచురించింది.
అగ్ర కంపెనీలు హ్యుందాయ్ మోటార్స్, యాపిల్ ఐఎన్సీ కలిసి పనిచేయనున్నాయి. అటానమస్ విద్యుత్తు కార్ల తయారీ కోసం వీటి కలయిక జరగునుంది. ఇందుకు సంబంధించిన కథనాన్ని కొరియా ఐటీ న్యూస్పేపర్ తాజాగా ప్రచురించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఈ అగ్ర కంపెనీల ఒప్పందానికి సంబంధించిన విషయాలు మార్చి నాటికి ఓ కొలిక్కి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శుక్రవారం హ్యుందాయ్ ఈ విషయాన్ని సూచనప్రాయంగా తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
యాపిల్ కంపెనీతో తమ చర్చలు ప్రారంభ స్థితిలో ఉన్నట్లు వివరించింది. ఈ వార్తల నేపథ్యంలో హ్యుందాయ్ కంపెనీ షేర్లు దాదాపు 20 శాతం పెరగడం విశేషం. కొరియా పత్రిక వెల్లడించిన కథనంపై యాపిల్, హ్యుందాయ్ కంపెనీలు ఎటువంటి ప్రకటనలు చేయాలేదు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ఆ ఇరు సంస్థలు కలిసి తయారు చేసే కార్లను జార్జియాలోని కియా మోటార్ ఫ్యాక్టరీ నుంచి తీసుకురావాలని యోచిస్తున్నారు. అక్కడ కుదరక పోతే ఇందుకోసం సంయుక్తంగా అమెరికాలో మరో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్నది ఈ రెండు కంపెనీల ఆలోచనగా తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
నాలుగు లక్షల కార్ల తయారీ సామర్థ్యంతో రూపొందించనున్న ఈ కొత్త ప్లాంట్ నుంచి 2024 నాటికి లక్ష కార్ల వరకు ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు. కియా మోటార్స్ హ్యుందాయ్ అనుబంధ సంస్థ అన్న విషయం తెలిసిందే.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
యాపిల్, హ్యుందాయ్ సంస్థలు కలిసి రానున్న ఏడాదిలో యాపిల్ కార్ బీటా వెర్షన్ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆ పత్రిక కథనం పేర్కొంది.(ప్రతీకాత్మక చిత్రం)