Online apps: మీ పని మాది అంటున్న యాప్స్.. బూజు దులిపే దగ్గర నుంచి హెయిర్ కటింగ్ వరకు అన్నీ ఇంటి దగ్గరే.. ఏపీలో పెరిగిన డిమాండ్

On demand Home service apps: పండుగ వస్తోందా.. ఇంట్లో పనులు చాలా ఉన్నాయా.. అయితే నో టెన్షన్ మేమున్నామంటూ యాప్ లు ముందుకు వస్తున్నాయి.. పని ఏదైనా చిటికెలో చేసేస్తామంటూ హామీ ఇస్తున్నాయి.. ఇంట్లో బూజులు దులిపే దగ్గర నుంచి.. హెయిర్ కటింగ్ వరకు ఏ పనైనా సరే.. క్షణాల్లో వాలిపోతమంటూ భరోసా ఇస్తున్నాయి. ప్రస్తుతం ఇలాంటి యాప్ లకు ఏపీలో డిమాండ్ పెరుగుతోంది.