ఈ స్మార్ట్ వాచ్.. 1.43 అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. దీన్ని తెరవగానే లోపల ఉన్న వైర్లెస్ TWS ఇయర్‌బడ్‌లు బయటకు వస్తాయి. ఇవి చిన్నగా ఉంటాయి. ఈ స్మార్ట్‌వాచ్‌లో.. ఇతర స్మార్ట్‌వాచ్ లలో లభించే అన్ని రకాల ఫీచర్లూ లభిస్తాయి. హార్ట్ రేట్ ట్రాకర్, స్లీప్ ట్రాకర్, బ్లడ్ ఆక్సిజన్ ట్రాకర్ వంటివి ఉన్నాయి.
AI నాయిస్ క్యాన్సిలేషన్ కాలింగ్, వేర్ డిటెక్షన్ టెక్నాలజీ కూడా ఈ బడ్స్‌లో ఉంది. దీంతో పాటు, సైన్ సపోర్ట్ ఫీచర్ కూడా ఉంది. ఈ వాచ్‌లో 410 mAh బ్యాటరీ ఉంది. అలాగే ప్రతీ బడ్లో 30 mAh బ్యాటరీ ఉంది. ఈ బడ్స్ ANC ఆన్‌లో ఉన్నప్పుడు 3 గంటల పాటు పనిచేస్తాయి. అదే సమయంలో వాచ్ 3 గంటల పాటు పనిచేస్తుంది. దీని ధర 449 బ్రిటిష్ పౌండ్లు అంటే దాదాపు రూ.44,702 ఉంది.