ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) తన iOS యూజర్లకు సరికొత్త ఫీచర్లను లాంచ్ చేసింది. వాట్సాప్ లేటెస్ట్ iOS వెర్షన్ 23.1.75లో “సెర్చ్ బై డేట్ (Search by date)” అనే కొత్త ఫీచర్‌ను రిలీజ్ చేసింది. ఐఫోన్ యూజర్లు తమ వాట్సాప్‌ను వెర్షన్ 23.1.75కి అప్డేట్ చేసుకోవడం ద్వారా ఈ ఫీచర్ పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
వెర్షన్ 23.1.75లో “లాస్ట్ సీన్ & ఆన్లైన్ (Last seen & Online)” ఫీచర్‌ను కూడా పరిచయం చేసింది. అలానే ఇతర అప్లికేషన్ల నుంచి వాట్సాప్‌లో ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ ఈజీగా షేర్ చేసుకునేందుకు డ్రాగ్ & డ్రాప్ (Drop & Drag) ఫీచర్‌ను అందించింది. ఇంకా మరెన్నో ఫీచర్లను పరిచయం చేసింది. అవేంటో చూడండి. (ప్రతీకాత్మక చిత్రం)
దీని సహాయంతో యూజర్లు తమకు తామే మెసేజ్ పంపవచ్చు. కొత్త అప్డేట్లో లాస్ట్ సీన్‌తో పాటు ఆన్లైన్ స్టేటస్ దాచే ఫీచర్ కూడా వచ్చింది కాబట్టి ఆన్లైన్లో ఉన్నప్పుడు ఆ స్టేటస్‌ను ఎవరు చూడగలరో యూజర్ నిర్ణయించవచ్చు. ఆన్లైన్ స్టేటస్‌ను ప్రైవేట్‌గా ఉంచాలనుకునే వినియోగదారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
అంతేకాకుండా, పంపించిన మెసేజ్ 'డిలీట్ ఫర్ మీ' ద్వారా డిలీట్ చేసినప్పుడు దాన్ని అన్డూ చేయగల సామర్థ్యాన్ని కూడా అందించింది. ఒకే ఒక అప్డేట్తో ఇన్ని ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ ఐఓఎస్ యూజర్లను ఖుషి చేస్తోంది. ఇక డ్రాగ్ & డ్రాప్ ఫీచర్‌తో ఇమేజ్, వీడియో ఫైల్లు, డాక్యుమెంట్లను నేరుగా వాట్సాప్‌లోకి డ్రాగ్ చేయగల సామర్థ్యాన్ని కూడా వాట్సాప్ పరిచయం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే కొత్తగా iOS యూజర్లకు అందుబాటులోకి వచ్చిన అన్ని ఫీచర్లలో “సెర్చ్ బై డేట్” హైలైట్‌గా నిలుస్తోంది. ఈ ఫీచర్ ఓల్డ్ చాట్స్ చాలా ఫాస్ట్‌గా కనిపెట్టడానికి ఉపయోగపడుతుంది. ఇది తేదీల వారీగా మెసేజ్‌లను సెర్చ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. మరి ఈ ఫీచర్‌ను ఎలా వాడాలో ఇప్పుడు స్టెప్-బై-స్టెప్ తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
సెర్చ్ బై డేట్ ఫీచర్ వాడే స్టెప్స్
యూజర్లు ఐఫోన్లో వాట్సాప్ యాప్ ఓపెన్ చేయాలి. ఏదైనా పర్టికులర్ మెసేజ్ కోసం సెర్చ్ చేయాలనుకుంటే.. ఆ మెసేజ్ ఉన్న చాట్‌కి వెళ్లాలి. తర్వాత, ఐకాన్ నేమ్‌పై క్లిక్ చేయాలి. అనంతరం Search ట్యాబ్ సెలక్ట్ చేయాలి. ఈ సెర్చ్ ఆప్షన్లో మీకు కావలసిన మెసేజ్‌ను క్షణాల్లో సెర్చ్ చేయవచ్చు.
మీరు ఒక పర్టికులర్ తేదీలో పంపిన మెసేజ్ కోసం సెర్చ్ చేయాలనుకుంటే, మీ స్క్రీన్ రైట్ కార్నర్లో ఉన్న క్యాలెండర్ ఐకాన్‌ను నొక్కాలి. అప్పుడు మీకు డేట్స్ సెలెక్ట్ చేసుకునేందుకు వీలుగా ఒక డేట్ టూల్ డిస్ప్లే అవుతుంది. మీరు వెతుకుతున్న మెసేజ్‌ను పొందడానికి కావలసిన సంవత్సరం, నెల, తేదీని ఎంచుకోవాలి. అంతే ఆ తేదీకి సంబంధించిన మెసేజ్ క్షణాల్లో ప్రత్యక్షమవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)