దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. వాటి ధర అనేక చోట్ల రూ.100 దాటడంతో తమ వెహికిల్స్ ను బయటకు తీయాలంటేనే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మీ వాహనం యొక్క మైలేజీ ఎంత వస్తుందనేది ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవడం చాలా ముఖ్యం. మీ వాహనం తక్కువ మైలేజీ ఇస్తూ ఉంటే కనుక.. అందుకు గల కారణాన్ని తెలసుకుని అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అయితే, మీ వాహనం యొక్క మైలేజ్ ను పెంచుకోవడానికి మీరు ఈ కింది చిట్కాలను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
సరైన సమయంలో క్లచ్ ఉపయోగించండి
డ్రైవింగ్ చేసేటప్పుడు తరచుగా క్లచ్ ఉపయోగించడం మానేయాలి. మీరు ఎంత ఎక్కువ వాడితే అంత ఎక్కువ ఇంధనాన్ని ఖర్చు చేస్తున్నారన్నమాట. అవసరం లేని చోట క్లచ్ని అస్సలు ఉపయోగించవద్దు. కొత్త డ్రైవర్లు తరచుగా క్లచ్‌ను వినియోగిస్తారు. ఇది మీ క్లచ్ ప్లేట్లను కూడా దెబ్బతీస్తుంది. అవసరమైనప్పుడు మాత్రమే క్లచ్ ను వినియోగించడం అలవర్చుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
టైర్లో గాలిని పరిశీలించడం..
కారు టైర్లలో ఎల్లప్పుడూ సరైన ప్రెజర్ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే టైర్లో తక్కువ గాలి ఉండటం దాని మైలేజీపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఎక్కువ గాలి టైర్ పగిలిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే గాలి పీడనాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం చాలా ముఖ్యం. మీకు బడ్జెట్ ఉంటే, మీరు కారు టైర్లలో ఎయిర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌ను కూడా ఇన్స్టాల్ చేయించుకోవడం బెటర్. (ప్రతీకాత్మక చిత్రం)
వేగం
కారు నడుపుతున్నప్పుడు, కారు యొక్క వేగాన్ని ఎల్లప్పుడూ చాలా తక్కువగా లేదా చాలా ఎక్కువగా ఉంచకూడదు. ఎందుకంటే కారు యొక్క మైలేజ్ గరిష్ట వేగంపై ఆధారపడి ఉంటుంది. సరైన వేగంతో డ్రైవ్ చేస్తే అత్యుత్తమ మైలేజీ వస్తుంది. కారు వేగం గంటకు 80 కి.మీ నుండి 100 కి.మీల మధ్య ఉంటే, హైవేపై కారు మంచి మైలేజీని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
సకాలంలో సర్వీస్
మంచి మెయింటెనెన్స్ మరియు కారు యొక్క సాధారణ సర్వీస్ దాని మైలేజీని పెంచడంలో సహాయపడుతుంది. ఇంజిన్లు మరియు గేర్‌బాక్స్‌ల వంటి వాహనాల తిరిగే భాగాలకు లూబ్రికేషన్ అవసరం. సర్వీసింగ్ సరిగా చేయించకుంటే మైలేజీ తగ్గుతుంది. కావున కారు కొత్తదైనా పాతదైనా సరే ఎప్పటికప్పుడు సర్వీస్ చేయడం తప్పనిసరి. కనీసం ఏడాదికి ఒకసారి లేదా 10 వేల కిలోమీటర్లు నడిచిన తర్వాత అయినా సర్వీస్ చేయించండి. (ప్రతీకాత్మక చిత్రం)