3. జీమెయిల్లో పేరు మార్చుకోవచ్చన్న విషయం అందరికీ తెలియదు. అంటే డిస్ప్లే నేమ్ మార్చుకోవచ్చు. జీమెయిల్లో పేరు మార్చుకోవడం ఎలా? అని మీరు కూడా ఆలోచిస్తున్నారా? జీమెయిల్లో డిస్ప్లే నేమ్ మార్చడానికి ముందుగా మీ జీమెయిల్లో లాగిన్ కావాలి. టాప్ రైట్లో సెట్టింగ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఆ తర్వాత All Settings ఓపెన్ చేయాలి. ఆ తర్వాత Accounts and Import ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. మీ పేరు కనిపించే దగ్గర edit info లింక్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ పేరు ఎలా కనిపించాలనుకుంటే అలా టైప్ చేసి సేవ్ చేయండి. మీరు మార్చినట్టుగానే మీ పేరు కనిపిస్తుంది. అయితే మీ జీమెయిల్ ఐడీనే యూజర్ నేమ్‌గా పెట్టుకోకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)
5. మీరు పేరు మాత్రమే మార్చగలరు కానీ మీ యూజర్ నేమ్, జీమెయిల్ ఐడీ మార్చలేరు. మీరు ప్రొఫెషనల్, ఎడ్యుకేషనల్ అవసరాల కోసం జీమెయిల్ మెయింటైన్ చేస్తుంటే మీ డిస్ప్లే నేమ్‌లో మీ పేరు ఉండాలి. నిక్ నేమ్స్, షార్ట్ ఫామ్స్ ఉండకూడదు. దీని వల్ల మీరు ఎవరికైనా మెయిల్ పంపినప్పుడు మిమ్మల్ని గుర్తించకపోయే అవకాశం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. మీరు మెయిల్ పంపినప్పుడు మొదట డిస్ప్లే నేమ్ కనిపిస్తుంది. ఆ తర్వాతే మీ మెయిల్ ఐడీ కనిపిస్తుంది. అందుకే ఉద్యోగాలకు అప్లై చేసేవారు నిక్ నేమ్స్ పెట్టకూడదు. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు ఇది తప్పకుండా పాటించాలి. అవసరమైతే ప్రొఫెషనల్ అవసరాలకు ఒక మెయిల్ ఐడీ, పర్సనల్ అవసరాలకు మరో మెయిల్ ఐడీ క్రియేట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)